CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సడక్ బంద్ విజయవంతం

Share it:

 


మన్యం టీవి,ఇల్లెందు:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈరోజు ఏఐసీసీ మరియు పిసిసి అధ్యక్షులు , మరియు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను మరియు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అవకతవకలకు వ్యతిరేకంగా మరియు రాష్ట్రంలో లో వివిధ నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా వ్యవసాయ రంగంలో వారిని జొప్పించి దేశానికి వెన్నుముక అయినటువంటి రైతన్నకు వెన్ను విరిచేలా మూడు నల్ల చట్టాలను తీసుకు వచ్చారని అందులో మొదటి చట్టం ద్వారా కార్పొరేట్లకు అనుకూలంగా పంటలు వేయాలని మరియు రుణ సదుపాయం కూడా వారి దగ్గరనే పొందాలని పొందుపరుస్తున్నది. ఈ చట్టం వల్ల దేశంలో ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉందని రైతుకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఏమాత్రం లేదని వారు ఆరోపించారు. రెండవ చట్టంలో లో రైతులు వారి ఉత్పత్తులను దేశంలో ఎక్కడా అయిన అమ్ముకోవచ్చని , ఒకే దేశం ఒకే మార్కెట్ వ్యవస్థ అనే నినాదాన్ని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ చట్టం వల్ల రైతులు సుదూర ప్రాంతాలకు వారి ఉత్పత్తి అమ్ముకోలేక దళారుల చేతిలో పడి ఆర్థికంగా చితికిపోయే అవకాశం ఉందని రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ , అఖిలపక్షం కోరుకున్నది ఒకే దేశం ఒకే గిట్టుబాటు ధర అని వారు తెలిపారు. మూడో చట్టం వల్ల దళారులు నిత్యావసర వస్తువులను మార్కెట్ కి రాకుండా బ్లాక్ చేసి నిత్యవసర వస్తువులను 4 రెట్లు పెంచి అమ్ముకునెలా ఉందని తద్వారా రైతు మరియు వినియోగదారుడు విపరీతంగా నష్టపోయే అవకాశం ఉందని వారు తెలిపారు. కాబట్టి ఈ మూడు నల్ల చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర విద్యుత్ చట్టం వల్ల సామాన్య గృహ సముదాయాలకు క్రాస్ సబ్సిడీ వర్తించదని తద్వారా ఆర్థిక భారానికి లోనవుతారని మరియు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్యుత్ చట్టం ద్వారా వారందరికీ మీటర్లు బిగించి వేలకు వేలు గా బిల్లు వచ్చే అవకాశం ఉందని తద్వారా రైతన్న రోడ్డు మీద పడే అవకాశం ఉందని వారు తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో అసెంబ్లీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా గా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం తెలంగాణలో 93 వేల 494 గిరిజన జనాభా కు 300092ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందనీ మరియు 721 సామూహిక సంఘాలకు 454055 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజన ఆదివాసిల దగ్గర్నుంచి పోడు భూములు లాక్కున్నారని 2018 ఎన్నికల హామీ లో భాగంగా కుర్చీ వేసుకుని మరీ పోడుభూములకు పట్టాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని ఒకవేళ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీలో వారికి కుర్చీ వేసేవారు లేకపోతే తాము అందరం కలిసి కుర్చీ వేస్తామని దానిలో కూర్చొని గిరిజన ఆదివాసులకు పోడు భూములకు పట్టాలివ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 లో రెండవసారి రుణమాఫీ ప్రకటించింది. రూపాయలు 25936 కోట్లు 40.66 లక్షల మందికి మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 5.83 లక్షల మందికి కి 1,197 కోట్లు మాత్రమే ఒక విడత రుణమాఫీ చేశారు. ఇదివరకు 2014లో లో మాఫీ చేసిన రుణం 16124 కోట్లు నాలుగు విడతలుగా మాఫీ చేయడంతో రైతులపై 9812 కోట్ల వడ్డీ భారం పడింది. అదే రైతులే చెల్లించారు. కాబట్టి ఈసారి ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ వల్ల రైతులు వారి భూములు రిజిస్ట్రేషన్ కాక నష్టపోతున్నారని ఇప్పటికే సాదాబైనామా లు 1096344 పటాలకు నోచుకోలేదని, గతంలో ఇచ్చిన పాసుపుస్తకాల లో 2,65,653 తప్పులు దొర్లాయి. వీటిని సవరించకుండా ధరణి వెబ్సైట్ రూపొందించడం సరికాదని దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 2020 ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చిన వరదల వలన రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వందల ఇండ్లు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారని 2014 నుండి 2020 వరకు మొత్తం 25306 కోట్ల పంట నష్టం వాటిల్ల గా 14 ఫైనాన్స్ కమిషన్ కేవలం 3246 కోట్లు మాత్రమే సహాయం చేసి చేతులు దులుపు కుందని దేశంలోని రాష్ట్రాలన్ని కేంద్రం నుండి సహాయం కోరగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ధనిక రాష్ట్రమని ప్రగల్భాలు పలుకుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు తెలిపారు. అన్నపూర్ణ గా రూపొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఏటా సగటున 680 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి పహాని లో రికార్డు అయిన వారికి మాత్రమే బీమా ప్రీమియం చెల్లిస్తున్నదని, మిగిలిన వారు ఆత్మహత్యకు పాల్పడితే ఎలాంటి సహాయం ఎక్స్గ్రేషియా అందలేదని వారు తెలిపారు. విద్యుత్ షాక్ వల్ల మరో 600 మంది మరణిస్తున్నారని, రుజువు కాలేదన్న నెపంతో డిస్కంలు పరిహారం ఎగవేస్తూన్నాయని వారు తెలిపారు. రైతు ఆత్మహత్యల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఎస్కే జానీ, జీవి భద్రం, కృష్ణ, కోటగిరి నవీన్, ధనరాజ్, కమల, సాంబ మహేష్, శేఖర్, లక్ష్మీనారాయణ, ఇందిరా లోద్, ప్రవీణ్, పొడుగు రాంబాబు, పసిక తిరుమల్, అరవింద్ స్వామి, రవి, నరేష్ , యువజనకాంగ్రెస్ నాయకులు గణేష్, నరేష్ రమేష్ బాలకృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: