CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను విడుదల చేయాలి

Share it:

 


👉◆【 సి ఐ టి యు నాయకుల ఆధ్వర్యంలో డిమాండ్】◆

👉●【గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19 వేల రూపాయలు ఇవ్వాలి】●

మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-08):: రాష్ట్ర ప్రభుత్వం 74 రంగాల షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్( సి ఐ టి యు) నాయకులు, గ్రామ పంచాయతీల కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్ నుండి ర్యాలీగా ప్రదర్శన చేస్తూ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని, తాసిల్దార్ భద్రకాళి కి 74 రంగాల షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి,గ్రామపంచాయతీ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,000/- వేల రూపాయలు ఇవ్వాలని. పండగ,ఆదివారం దినాలను సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్న,రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు జీవోను విడుదల చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని. పెరిగిన నిత్యావసర వస్తువుల రేట్లతో కార్మిక కుటుంబాల బతుకు జీవనం దుర్భరంగా ఉందని, గ్రామపంచాయతీ కార్మికులకు పి ఆర్ సి ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని. మోడీ సర్కార్ పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్ల బాధితులతో సామాన్య ప్రజలు తల్లడిల్లి పోతున్నారని. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు గుండు పుల్లారావు,వి వి కృష్ణారావు, రామకృష్ణ,కోట కిరణ్, తాటి నాగరాజు, తాటి వెంకటేష్, వెంకటలక్ష్మి, మంగ, నాగరాణి, జమ్ములమ్మ, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: