CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీలో అక్రమ కట్టడాలను కూల్చివేసి గిరిజనేతరులను ఏజెన్సీ ప్రాంతం నుండి పంపివేయాలి-ఆదివాసీ సేన.

Share it:

 


 👉 ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఊకె రవి డిమాండ్.

మాన్యం టివి:ములకలపల్లి మండలం: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన,నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలుపుదల చేసి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అక్రమంగా,రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీలోకి చొరబడి గిరిజనుల సంస్కృతి,సాంప్రదాయలను భంగపరుస్తూ,గిరిజనుల భూములను ఆక్రమిస్తు శాంతి,భద్రతల ఉల్లంఘనలు పాల్పడతున్న గిరిజనేతరుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,వారిని తక్షణమే ఏజెన్సీ ప్రాంతం నుండి పంపివేసేవిందంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా జెడ్పి ఛైర్మన్ కోరం కనకయ్య మరియు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కు వినతిపత్రం అందజేయడం జరిగింది.అదేవిందంగా ములకపల్లి ఎస్ ఐ,తహశీల్దార్ల బాధితుల సంఘం కూడా తమ సమస్యలను పరిష్కరించాలని,గతంలో పనిచేసిన,ఎస్ ఐ,తహశీల్దార్ లపై కేసు నమోదు చేసి,అరెస్టు చేసే వింధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.అనంతరం ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఊకె రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల వలసలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని అలాగే అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నారని,వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని,అక్రమంగా నిర్మించిన ఇళ్ళను కూల్చివేయాలని, అర్హులైన ఆదివాసీ పేదలకు పంపిణీ చేయాలని,చట్ట విరుద్ధంగా వలస వచ్చిన గిరిజనేతరులను పంపించాలని లేని పక్షంలో ఆదివాసీ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.అలాగే ఈ దరఖాస్తుల మీద 30 రోజులలో జెడ్పి చైర్మన్, ఎమ్మెల్యే స్పందించకపోతే త్వరలోనే జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే ల బాధితుల సంఘం ఏర్పాటు చేసి ఒక కొత్త పద్ధతులతో జిల్లా వ్యాప్తంగా పోరాటాలు నిర్మిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన నాయకులు కారం వెంకటేష్,సవలం గోపయ్య,పొట్ట మహేష్,సవలం రాములు,పొట్ట రాములు,రాఘవయ్య, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: