CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేర ప్రవృత్తి గల వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవు

Share it:

 


*దోపిడిలకు పాల్పడే ముఠాల సమాచారాన్ని పోలీసుశాఖకు తెలపండి. 

*జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ మావోయిస్టుల పేరు చెప్పి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని సమాచారం మేరకు ఏటూరునాగారం ఎస్ఐ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని అతని తనిఖీ చేయగా ఒక నకిలీ ప్లాస్టిక్ పిస్తోలు,మావోయిస్టు దామోదర్ పేరుమీద గల తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీ లెటర్ ప్యాడ్ ను నిందితుడి వద్ద నుండి స్వాధీన పరుచుకున్నారని, అనంతరం నిందితుడుని విచారించగా ఇంకా మిగతా ముగ్గురు నిందితులు కూడా ఈ దోపిడీలో ఉన్నారని ప్రధాన నిందితుడు తెలిపాడని, జాతీయ ప్రధాన రహదారి పై రోహిరు గ్రామం శివారులో ప్రధాన నిందితుడి కోసం వేచి చూస్తున్నారని తెలుపగా ఏటూరు నాగారం ఎస్ఐ వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని మిగతా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారనీ.

అనంతరం నిందితులను విచారించగా వారందరూ ఆర్థిక ఇబ్బందులతో సత మత మవుతున్నారని సులభంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఈ దోపిడీలకు పథక రచన చేసినట్టు తెలిపారని,నిందితులకు సిపిఐ మావోయిస్టు పార్టీ లెటర్ ప్యాడ్ రాయడం ఎలాగో అనుభవం కలిగి ఉన్నారు.ఈ లేఖను నిజంగా మావోయిస్టు పార్టీ వారే పంపారు అనేలా పొందుపరిచారని,మూడు నెలల కాలంలో వీరు మొత్తం నలుగురు బాధితులను బెదిరించారని,10 నుండి 20 లక్షల రూపాయలు ఒక వ్యక్తి నుంచి వీరు డిమాండ్ చేశారని. మొత్తం నలుగురు వ్యక్తులలో ఒక వ్యక్తి వీరికి భయపడి 15 లక్షల రూపాయలు ఇచ్చాడని.

మొత్తం వీరిపై ములుగు జిల్లాలో 4 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసామని,వీరి వద్దనుండి 13 లక్షల 50 వేల రూపాయలను మరియు మిగతా వస్తువులను స్వాధీన పరుచుకునమని ఇంకా ఈ దోపిడీ ముఠా లోఇతర వ్యక్తుల ప్రమేయం పై నేర పరిశోధన చేస్తున్నామని అన్నారు. నిందితుల వద్ద నుండి

స్వాధీనపరుచుకున్న వస్తువుల వివరాలు రూ.13,50,000 నగదు,నాలుగు సిపిఐ మావోయిస్టు పార్టీ దామోదర్ పేరు పై గల లేఖలు,ఒక నకిలీ పిస్తోలు,ఒక MI 40 inch TV, ఒక మిక్సర్ గ్రైండర్,ఒక కరిజ్మా బైక్,ఒక జస్ట్ కార్,నాలుగు మొబైల్ ఫోన్స్ స్వాధీన పరుచుకున్న మని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు.ఈ సమావేశంలో ఏటూరు నాగారం ఏఎస్పి గౌస్ ఆలం,ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్,ఎస్ఐ ఏటూరునాగారం శ్రీకాంత్ రెడ్డి, మరియు ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ చరణ్ ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: