CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ వ్యాక్సిన్ సంచార వాహన సేవలు ప్రజల సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ వైద్యురాలు ప్రియాంక

Share it:

 


( ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 90% కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి )

మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకొని ప్రజలకు మరియు ఆసుపత్రులకు రాలేకపోతున్న వారికి, కోవిడ్ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సంచార వాహనం ద్వారా పి హెచ్ సి పరిధిలోని పలు గ్రామాల్లో సంచరించి ప్రజల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నామని ప్రభుత్వ వైద్యురాలు ప్రియాంక తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గ్రామాల్లోని రహదారుల వెంట క్యాంపులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తూ, ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 90 శాతం వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేశామని. కొద్దిరోజుల్లోనే కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేస్తామని వైద్యురాలు ప్రియాంక తెలిపారు. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో వైద్య బృందం హెచ్ఈఓ- పోలేబోయిన కృష్ణయ్య, హెచ్వి-శారారాణి, ఏఎన్ఎం- సవలం పుష్ప రాజ్యం, గుర్రం వాణి, ప్రేమలత, ఆశాలు-స్వరూప, సుభద్ర, సుశీల, తదితరులు ఉన్నారు.

Share it:

Post A Comment: