CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ 81వ వర్ధంతి ఘనంగా నిర్వహించాలి.

Share it:

 


 మన్యం మనుగడ వాజేడు. భారతదేశoలో ఆదివాసి హక్కుల కొరకు జరిగిన పోరాటం చారిత్రాత్మకమైనవి ఆదివాసీలపై నిజాం నవాబులు దోపిడి దౌర్జన్యంలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన పోరాటయోధుడు ,ఆదివాసి హక్కులకై అసువులు బాసిన కొమరం భీమ్ 81 వర్ధంతి సభలు సమావేశాలు ప్రతి ఒక్క ఆదివాసి గూడెంలో ప్రతిన పూనేల, ఆదివాసి ప్రజల్లో చైతన్యం తేవాలని, కొండ కోనల్లో ప్రకృతితో జీవనం సాగించే ఆదివాసి ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంగా భాగమని నినాదిస్తూ 1928 నుండి1940 వరకు రణభేరి మోగించి విరోచిత పోరాటం చేసిన కొమరం భీం నైజం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా మరీనా పొరతాయోధుడు భీం , జల్- జమీన్ -జంగల్ .అనే నినాద కర్త, ఆదివాసిల ఆరాధ్య దైవం, ఆదివాసీలకి ఆత్మగౌరవ ప్రతీకగా కొమరం భీమ్, స్వయంపాలన ఉద్యమాల వేగుచుక్క భీమ్, పోరాటo, చివరకు సరైనదని తన ఆదివాసి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్. 81 వర్ధంతి ఘనంగా నిర్వహించాలని సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పూసం. నరేష్. అన్నారు . వాజేడు మండల కేంద్రంలో జరగబోయే కొమరం భీమ్ 81 వర్ధంతి కొమరం భీమ్ విగ్రహం దగ్గర 20/10/21 బుధవారం నాడు ఉదయం 10:గంటలకు ప్రతి ఒక ఆదివాసీ సంఘాలు , ఉద్యగ సంఘాలు,మహిళ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ యువతి, యువకులు, పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గొంది. రమణ రావు. ఆదివాసీవిద్యార్థి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు బోదెబోయిన సురేష్, ములుగు జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు తల్లడి నానీబాబు,కంతి విజయ్,అయ్యూరి యాణయ్య, కొండ రామయ్య,గౌరారపు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: