CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Share it:

 



రూ.62,07,192 రూపాయల కళ్యాణ లక్ష్మీ,షాద్ మూభారక్ చెక్కుల పంపిణీ: జడ్పీటీసీ పొశం. నర్సింహారావు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని రెవెన్యూ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ చంద్ర శేఖర్ అధ్యక్షత న కళ్యాణ లక్ష్మీ,షాద్ మూభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండలం లో కళ్యాణ లక్ష్మీ,షాది మూభారక్ పథకాల ద్వారా వచ్చిన రూ.62,07,192 రూపాయల చెక్కులను మొత్తం 62 మంది లబ్ధిదారులకు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దేశంలో ఎక్కడ లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ లో ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.పేద అడబిడ్డల పెళ్లికి కానుకగా సీఎం కేసీఆర్ కులాలకు, మతాలకు అతీతంగా,రూ.1,00,116 రూపాయల చెక్కును అందజేస్తున్నారు అని,తద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అని,ఎటువంటి అవినీతికి కి అవకాశం లేకుండా పథకాన్ని సీఎం కేసీఆర్ రూపొందించారు అని తెలిపారు.రైతు బంధు, రైతు భీమా,లాంటి అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ప్రత్యేక కృషి తో నిధులు సాధిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు అనేక చేస్తున్నారని,ఇటీవల సింగరేణి అధికారుల తో చర్చలు జరిపి సి.ఎస్.ఆర్ నిధుల నుండి రూ.2 కోట్ల రూపాయలు మంజూరు చేపించారని,అంబేద్కర్ సెంటర్ నుండి బాంబే కాలనీ వరకు రోడ్డు వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపడతామని తెలిపారు.విప్ రేగా కాంతారావు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు అని,అభివృద్ధి కార్యక్రమాలే అందుకు నిదర్శనం అని తెలిపారు. ప్రజలు అందరూ ప్రభుత్వ పథకాలపై చర్చ జరపాలని, టిఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అందరు సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలని, బతుకమ్మ,మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కె.వి.రావు,తహశీల్దారు చంద్ర శేఖర్,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు,ఎంపీటీసీలు బాబురావు,రమ్య,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక.ప్రసాద్, బచ్చల.భారతి,సతీష్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, పార్టీ కార్యదర్శులు,పార్టీ నాయకులు,మహిళ అధ్యక్షులు రమాదేవి,చంద్రకళ, కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: