CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతం: సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్

Share it:

 
 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  అశ్వారావుపేటలో  పోలీస్ అమరవీరుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్  బంధం ఉపేందర్ మాట్లాడుతూ, రాజ్యాంగం  ఏర్పాటు తర్వాత ప్రజావసరాల కోసం, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తున్నదన్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రజా రక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం అజరామరంగా నిలిచిపోతుందని, అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్ అన్నారు.1959 అక్టోబర్ 21వ తేదీన సీఆర్పీఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వం లోని భారత జవాన్లు ఈశాన్య లడక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని,  వీరి ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నట్లు  తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీసు మరియు ఆర్మీ శాఖలకు చెందిన 377 మంది అధికారులు వివిధ సంఘటనలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడి, దేశ రక్షణ కోసం అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి 31 వరకు జిల్లాలో పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ఆయుధాల పట్ల విద్యార్థులకు అవహగన కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్, జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు వీటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్, ఎస్ఐ చల్లా అరుణ, ఎస్సై రామ్మూర్తి, ఏఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: