CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విస్తరిస్తున్న జేడీ పౌండేషన్ సేవా కార్యక్రమాలు.

Share it:

 మన్యం టీవి, మణుగూరు:

మేము సైతం మిత్రమండలి తో జత కట్టిన జే.డీ మణుగూరులో సేవా కార్యక్రమాలు కొనసాగింపు.సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా మణుగూరు పట్టణంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నిరుపేదలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న "మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్", అలాగే గత 3 సంవత్సరాలుగా ప్లాస్టిక్ రహిత భద్రాద్రి తో ప్రారంభమై ఉపాధి భరోసా మరియు అనేక పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తున్న జే.డీ (జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్) భద్రాచలం, ఇరు సంస్థలు పెద్దలు ఆశీర్వాదము మరియు సేవా మూర్తుల అండదండలతో ఈ ది.(22.10.2021) సంయుక్తంగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారు. సామాజిక బాధ్యత కు పెద్ద పీట వేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు సంయుక్తంగా  మణుగూరు, ప్రాంతాలలో కొనసాగించడానికి వీలుగా ఇకపై పైన రెండు తెలిపిన స్వచ్ఛంద సంస్థలు పరస్పర అంగీకారాన్ని తెలుపుతూ ఒప్పందం చేసుకున్నాయి.. ఈ మేరకు మణుగూరు పట్టణంలో ఉచిత అంబులెన్స్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ నందు ముఖ్య అతిథిదులు గా  విచ్చేసిన పినపాక శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు,నల్గొండ SP , శ్రీ AV రంగనాథ్, IPS DIG, శ్రీ L. సుబ్బారాయుడు SP -CID, శ్రీ పి. బాలరాజు CE-BTPS,శ్రీ వై. నందకిషోర్(చైర్మన్, గమన్ హాస్పిటల్స్ సమక్షంలో ఇరు సంస్థల ముఖ్యులు శ్రీ పసునూరి భాస్కర్, శ్రీ మురళీమోహన్ కుమార్ లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రేగా కాంతారావు, శ్రీ AV రంగనాథ్, ఇతర ప్రముఖులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో 2 ప్రముఖ సంస్థలు పని చేయడం అభినందనీయమని జెడి ఫౌండేషన్ కి మరియు మేము సైతం మిత్రమండలి సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మిమిక్రీ కళాకారులు జల్లారపు రమేష్,తన వ్యాఖ్యానం తో ఆహ్వానితులను అలరించారు.ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ పి. వి. చారి, దోసపాటి నాగేశ్వరరావు,మణుగూరు చాంబర్ ఆఫ్ కామర్స్  దోసపాటి వెంకటేశ్వరావు ,దోసపాటి పిచ్చేశ్వరరావు దోసపాటి రాములతోపాటు జెడి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ పవన్ కుమార్, శ్రీ కడాలి నాగరాజు, శ్రీ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, శ్రీ యూసఫ్ మియా మేము సైతం మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: