CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక అభివృద్ధి విప్ , ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యం

Share it:

 



👉 పాతరెడ్డిపాలెంకు సబ్‌స్టేషన్‌ రూ.1 కోటి 34 లక్షలు మంజూరు 

👉టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి


మన్యం మనుగడ, పినపాక:పినపాక అభివృద్ధి విప్ రేగా కాంతారావు తో సాధ్యమని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి అన్నారు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాతరెడ్డిపాలెంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు అయిందని టీఆర్ఎస్‌ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు.

ఆదివారం ఏడుళ్ల బయ్యారం క్రాస్‌రోడ్ లో గల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,మండల పరిధిలోని పాతరెడ్డిపాలెం, చింతలబయ్యారం, ఎల్చిరెడ్డిపల్లి, వెంకట్రావ్‌పేట, జగ్గారం, సింగిరెడ్డిపల్లి, మద్దులగూడెం గ్రామాల పరిధిలో రైతులకు ఉపయోగపడేలా నూతనంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు అయిందన్నారు. తెలంగాణా ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు రైతుల కష్టాలను గుర్తించి రూ.1,34,00,000 

(ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు) సబ్‌స్టేషన్‌ మంజూరు చేయించారన్నారు. 33/11 కేవీ సామార్ధ్యం గల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు చేయడం మూలంగా ఏడూళ్లబయ్యారం సబ్‌స్టేషన్‌ పరిధిలో గల రైతులకు, గృహ అవసరాలకు కూడా ఉపయోగం జరుగుతుందన్నారు.ఈ సబ్‌స్టేషన్‌ మంజూరుతో అధిక లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోయో భాధలు రైతులకు తప్పాయన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రైతుల సమస్యలు తీర్చడంలో ముందుంటారన్నారు. 

ప్రజా అవసరాలను తీర్చే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రేగా కాంతారావును రైతులు ఆశీర్వదించాలన్నారు. త్వరలోనే స్థల సేకర పూర్తి చేసి టెండర్‌ ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు... 

 ఈ సమావేశంలో మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, ముఖ్య నాయకులు,సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, దాట్ల వాసుబాబు, ఉడుముల లక్ష్మిరెడ్డి, కొండేరు నాగభూషణం, పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, కురుకురి శ్రీనివాసరావు, వడ్లకొండ శ్రీను, యాంపాటి శ్రీనివాసరెడ్డి, కుందురు కృష్ణారెడ్డి, పాతరెడ్డిపాలెం సర్పంచ్ మేడ వెంకన్న, ఉప సర్పంచ్ మునిగెల సంతోష్,

 స్థానిక రైతులు కీసర శివారెడ్డి, చిట్యాల ప్రసాద్ రెడ్డి, వట్టి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: