CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడాన్ని, నిలిపివేయాలి..

Share it:



👉రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి -మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు డిమాండ్..


మన్యం టివి ,దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో లక్ష్మీ నగరం గ్రామంలో సిపిఎం పార్టీ 10 వ శాఖ మహాసభ కామ్రేడ్ ఎండి మహమ్మద్ బేగ్ అధ్యక్షతన జరిగిన మహాసభలో లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబు రావు మాట్లాడుతూ మనదేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే అలాగే బ్యాంకులు ఎల్ఐసి లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు అలాగే మనదేశంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన అటువంటి 3 వ్యవసాయ , చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ మధ్యకాలంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడం జరిగిందని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర లాంటి ధరలను వెంటనే తగ్గించాలని లేదంటే భవిష్యత్తు కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమ పోరాటాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు అలాగే దుమ్ముగూడెం మండలంలో ఉన్న న అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కేవలం మిషన్ భగీరథ పైప్ లైన్ పరిచి మంచినీళ్లు అందించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా వేసిన టువంటి ఆ స్కీమ్ ద్వారా సక్రమంగా ప్రతి గ్రామానికి మంచినీళ్లు అందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే ప్రతి పంచాయతీ కి గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఆ నిధులను గ్రామ సభ జరిపి ఆ నిధులు దేని కోసం ఖర్చు పెడతారో ఆ గ్రామ సభ ఆమోదం మేరకు ఆ నిధులను ఖర్చు పెట్టాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇప్పటికే చాలామంది గ్రామ పంచాయితీ సర్పంచులు అనేక అభివృద్ధి పనులు చేసి ఉన్నప్పటికీ వాటికి ఇంకా నిధులు కేటాయింపు జరగడం లేదని ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరడం జరిగింది అలాగే చదువుకున్న నిరుద్యోగులు అందరికీ ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు, సర్పంచ్ సరియం రాజమ్మ, సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, శాఖ కార్యదర్శి గుడ్ల రామ్మోహన్ రెడ్డి ,మండల కమిటీ సభ్యులు గుడ్ల సాయి రెడ్డి, మద్ది రామిరెడ్డి ,పంపన శివరావు, సిద్ధి నరసింహారావు, గుడ్ల తాతారావు, మహమ్మద్ బేగం ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: