CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎల్లలులేని విప్లవకారుడు ప్రవహించే ఉత్తేజం కామ్రేడ్ ఎర్నెస్టో చేగువేరా

Share it:

 

                                



న్యూడెమోక్రసీ మణుగూరు డివిజన్ కార్యదర్శి మోర రవి 

మన్యం టీవి, పినపాక:

  నియంతలను సామ్రాజ్య వాదులను గడగడలాడించి ఫిడెల్ క్యాస్ట్రో తో కలిసి క్యూబా దేశాన్ని అమెరికన్ సామ్రాజ్యవాద తొత్తు ప్రభుత్వం నుండి విముక్తి చేసి బొలీవియాను సామ్రాజ్య వాదుల నుండి విముక్తి చేయడానికి వెళ్లి అమరుడైన ఎల్లలులేని అంతర్జాతీయ విప్లవకారుడు గా కామ్రేడ్ ఎర్నెస్టో చేగువేరా ప్రపంచ విప్లవ చరిత్రలో నిలిచారని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు

శనివారం చేగువేరా 54 వ వర్ధంతి సభ మణుగూరు మండలం మొట్లగూడెం పెద్దిపెల్లి విప్పలగుంపు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డి విక్రమ్ అధ్యక్షతన జరిగిన కామ్రేడ్ చేగువేరా వర్ధంతి సభలో మోర రవి మాట్లాడుతూ 

ఉన్నత విద్యావంతులు అభ్యుదయ భావాలున్న ఎర్నెస్టో చేగువేరాలించ్ - సెలియో డేరా సెలా దంపతులకు 1928 జూన్ 14న అర్జెంటీనా దేశం రోజారియ పట్టణంలో ఎర్నెస్టో చేగువేరా జన్మించాడని చిన్ననాటి నుండి సాహిత్యంపైన తత్వశాస్త్రంపైన ఆసక్తితో ఉండేవాడనీ అన్నారు ఇంజనీరింగ్ పూర్తిచేసి వైద్య విద్యార్థిగా డాక్టర్ పట్టాపొంది మోటార్ సైకిల్ పై లాటిన్ అమెరికా చుట్టి రావాలన్న కోరికతో తన మిత్రుడు అల్బెర్టో రోనాల్డో తో కలిసి బయలుదేరి లాటిన్ అమెరికాలోని ప్రజలు సామ్రాజ్యవాద రక్కసి కోరల్లో చిక్కుకొని పడుతున్నబాధలను కళ్ళారా చూసి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించడమే తన లక్ష్యం అని ప్రకటించి క్యూబా విప్లవ నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో తో కలిసి క్యూబా యుద్ధ తంత్రాన్ని రచించి ఆ దేశాన్ని సామ్రాజ్యవాద నియంతల నుండి విముక్తి చేసి కొంతకాలం క్యూబా మంత్రివర్గంలో పని చేసి ఒక్క క్యూబా మాత్రమే కాదు సామ్రాజ్యవాద పీడన నుండి అన్ని దేశాలు విముక్తి కావాలని ఆశించి తన మంత్రి పదవికి రాజీనామా చేసి మిగతా అన్ని దేశాలను సామ్రాజ్యవాద నియంతల నుండి విముక్తి చేయాలనే సంకల్పంతో బొలీవియా దేశంలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించి సామ్రాజ్యవాద నియంతలకు నిద్ర లేకుండా చేశాడని అన్నారు సామ్రాజ్యవాద అమెరికన్ గూఢచార సంస్థలు కామ్రేడ్ చేగువేరాను ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని కాల్చిచంపి తర్వాత మళ్లీ బతుకుతాడేమో అని అతని శరీరాన్ని ముక్కలుముక్కలుగాచేసి ఖననం చేశారని అన్నారు ఒక డాక్టర్ గా రచయితగా కవిగా క్యూబా విప్లవసేనానిగా వీర గాథలు స్ఫురించే వీర యోధుడిగా యువతరం గుండెల్లో ప్రవహించే ఉత్తేజంలా అన్నీ వదులుకొని ప్రపంచ విప్లవ క్రమంలో సామ్రాజ్యవాదంపై రాజీలేని పోరాటంలో తానొక మార్గదర్శిగా నిలిచాడని ఆ యోధుడిని స్మరించుకోవడం అంటే సామ్రాజ్యవాదాన్ని అరికట్టేందుకు స్ఫూర్తి పొందడమే అని అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ లక్ష్మయ్య కృష్ణ శ్రీను సురేష్ వెంకటేశ్వర్లు సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: