CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడుహక్కుపత్రాలు ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేలకు ఇస్తే మరో ఉద్యమం తప్పదు

Share it:

 



తెలంగాణగిరిజనసంఘం (TGS)ఖమ్మం జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక


పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులు ,పేదలకు హక్కు పత్రాలు ఇచ్చే బాధ్యత స్థానిక ఎమ్మెల్యే లకు అప్పగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని,పోడు సాగు దారులకు ఆర్.ఓ.యఫ్.ఆర్ చట్టం ప్రకారం హక్కులు కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని లేకపోతే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు


అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 లో పేర్కొన్న విధంగానే 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న అటవీ భూములకు హక్కులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తో కూడిన షెడ్యూల్ ప్రకటించాలి. చట్టంలో లేని రాజకీయ జోక్యాన్ని ముఖ్యమంత్రి గారు రాజకీయ లబ్ధి కోసమే ఎమ్మెల్యేల ద్వారా హక్కులు కల్పిస్తామని ప్రకటన చేయడం గర్హనీయం.ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి రాజకీయ జోక్యం వల్లనే లక్షలాదిమంది గిరిజనులు, పేదలకు హక్కుల ఇవ్వకుండా నిరాకరించబడ్డారు. చట్టంలో పేర్కొన్న విధంగా గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీ గా అటవీశాఖ, రెవెన్యూ శాఖల కలయికతో చట్టాన్ని అమలు చేయాలి. పోడు భూముల సమస్య ఉన్న అన్ని గ్రామాలు ,ఆవాసాల్లో గ్రామ సభ కమిటీ లను వేయాలి. నూతనంగా దరఖాస్తులను ఆహ్వానించాలి.గతంలో కారణాలు లేకుండా తిరస్కరించిన దరఖాస్తులను తిరిగి పరిశీలించి హక్కులు కల్పించాలి. గ్రామ సభలో ఆమోదం పొందిన దరఖాస్తుల పరిశీలన నిమిత్తం సబ్ డివిజనల్ కమిటీ కి పంపాలి.అక్కడి నుండి జిల్లా కలెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, జిల్లా అటవీ శాఖ ల నేతృత్వంలో నియమించబడ్డ జిల్లా కమిటీ లో వీరి సంతకాలతో హక్కు పత్రాలను సిద్ధం చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. చట్టంలో ఇంత పారదర్శకంగా అమలు చేయాలని ఉంటే ,చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఎమ్మెల్యేలకు అధికారాలు ఇస్తే పోడు భూముల సాగు దారులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. అధికార పార్టీ అనుయాయులకే హక్కుపత్రాలు దక్కే ప్రమాదం ఉన్నది

పోడు భూముల సాగు దారులకు హక్కు ఇవ్వాలని గత నెల రోజులుగా అఖిల పక్షాలు,గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హక్కులు కల్పిస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు. చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు రూపొందించి అధికారిక ప్రకటన తక్షణం చేయాలి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో చెప్పినట్టు 2014 జూన్ 2 వ తేదీ వరకు కూడా హక్కులు ఇచ్చేందుకు తేదీని పొడిగిస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపి త్వరగా చట్ట సవరణ అయ్యేలాగా ఒత్తిడి తీసుకురావాలి. అటవీ హక్కుల గుర్తింపు చట్టం లో పేర్కొన్న విధంగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని అమలు చేయాలని చూస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది.

Share it:

Post A Comment: