CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తాలిపేరు ప్రాజెక్టులో సమీకృత మృత్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లలను విడుదల

Share it:

 




 మన్యం టీవీ చర్ల: 



ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యములో చర్ల మండలం పెద్దమిడిసిలేరు గ్రామము వద్ద ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్ లో  2021-22 సంవత్సరమునకు గాను సమీకృత మత్స్యఅభివృద్ధి పధకం క్రింద 7 లక్షల 88 వేల మేలురకాలయిన బొచ్చె, శీలావతి, మోసు 80-100 మి.మీటర్లు సైజు గల చేపపిల్లలను 100 శాతం రాయితీపై పెద్దమిడిసిలేరు సర్పంచ్ నారద లక్ష్మి,లక్ష్మికాలనీ సర్పంచ్ కల్తి బాలకృష్ణ, కోఆప్షన్ ఎంపీటీసీ  యస్ కె. సాధిక్,  మరియు తిప్పాపురం ఉపసర్పంచ్ నూపా కన్నారావు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగినది. ఈ  కార్యక్రమములో కె. వరదారెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి పాల్గొని మాట్లాడుతూ గిరిజనమత్స్యకారులు గిరిజనేతర మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి  రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి కార్యక్రమమును గత 5 సంవత్సరములనుండి దిగ్విజయముగా  చేపట్టుట జరుగుతుందని చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగినందువలన జిల్లాలోని మత్స్యకారులందరు చాలాసంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేసినారు. మత్స్యకారులు  విడుదలచేసిన చేపపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ప్రతి 15 రోజులకొకసారి విసురుడువలతో  చేపలను పట్టి వ్యాధులు ఏమైనా సోకినయా అని పరిశీలించాలని అదేవిధంగా అవి మేత తింటున్నాయా లేదా అని నిశితంగా పరిశీలించి వ్యాధులు ఏమైనా గుర్తించిన యెడల మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శులు,పాయం ప్రశాంతి యస్ .కె .రఫి, మత్స్యశాఖ క్షేత్రస్థాయి అధికారి యన్. కోటేశ్వర రావు  సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: