CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసు అమరులారా...!మీ త్యాగం మరువం.

Share it:

 మన్యం మనుగడ, వాజేడు:                   
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ములుగు జిల్లా. వాజేడు ,మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కొప్పుల తిరుపతి రావు. మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ఎందుకు జరుపు కుంటున్నామంటే భారతదేశం చైనా దేశాల సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ఈ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా   విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటారు .ఈ పవిత్ర స్థలం నుంచి ఆరంభమైంది. కనుకనే మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులో ఉన్న భారత భూభాగాలను లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు భద్రత దళాలు,  ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ నిర్వహించేవి, 1959 అక్టోబర్ 21 డి.ఎస్.పి కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడిన ఆ పోరాటంలో భారత జవాన్లు 10 మంది ప్రాణాలు కోల్పోయారు భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గ గా మారి పవిత్ర స్థలంగా రూపొందింది ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలు అక్కడికి వెళ్లి పోలీస్ అమరవీరులకు భారతమాత ముద్దుబిడ్డలకు జోహార్లు తెలియజేస్తారు.  ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఒకే ఒక్కడు పోలీస్  పోలీస్ అమర వీరులకు జోహార్లు. పోలీస్ అమర వీరులకు జోహార్లు.అని ఆయన ప్రసంగాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ శాఖ వారి సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: