CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానాన్ని వ్యతిరేకించండి: సీఐటీయూ

Share it:

 




మన్యం టీవీ మణుగూరు:


కేంద్ర ప్రభుత్వం,ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి పూనుకున్న నేపథ్యంలో,దానిని వ్యతిరేకిస్తూ,గురువారం మణుగూరు ఓసీ- 2 లో మరియు ఓసీ-4 లో ఫ్లకార్డులు పట్టుకొని,కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా  నినాదాలిస్తూ,కార్మికులు  నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఓ సీ-2 లో బ్రాంచి కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం  బొగ్గు పరిశ్రమలో ఉన్న 88 బ్లాకులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది అన్నారు. అందులో భాగంగా సింగరేణిలో ఉన్నటువంటి 4 బ్లాకులను కూడా కేంద్ర ప్రభుత్వం,బిడ్డింగ్లో పెట్టిన విషయం తెలిసినదే,ఇది సింగరేణి పరిశ్రమకు శరాఘాతంగా మారనుంది అన్నారు.ఈ బ్లాకులకు సంబంధించి,సింగరేణి ఇప్పటికే అరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టినట్లుగా,సింగరేణి యాజమాన్యం ప్రకటించింది అని తెలిపారు.ఈ విధానం సింగరేణి సంస్థకు శాపంగా మారనున్నది అని,అందువలన ఈ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు సమాయత్తం కావాలని  పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో వై.రామ్మూర్తి,ఎన్ ఈశ్వరరావు,టీవీ ఎంవి ప్రసాదరావు,బొల్లారం రాజు, లక్ష్మణ్రావు,మరియు కార్మికులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: