మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్,ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ జగదీష్...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను ములుగు జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి జగదీష్ అన్నారు... బతుకమ్మ పండుగా ప్రారంభోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రజలకు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు...
అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు అడపచులు అందరూ కలిసి ఆడే గోప్ప పండగ బతుకమ్మ అని.. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతి ని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు.. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు...ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు..ఈ పండుగను ప్రజలందరు వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
Post A Comment: