CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ బిడ్డ కాక.జోగరావుచదువుకు రూ.1లక్ష ఆర్ధిక వితరణ

Share it:

 


👉 ఆధార్ సొసైటీ రూ. 40 వేల ఆర్థిక వితరణ

👉వివిధ సంఘాలు మరో రూ

60 వేల వితరణ

👉"నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ" లో సీట్ సాధించిన ఆదివాసీ ముద్దు బిడ్డ .

👉 భారతదేశం గర్వపడే బిడ్డగా తయారవ్వాలి

👉 జోగారావు సన్మాన సభలో వక్తలు

మన్యం టీవి, దుమ్ముగూడెం:

 మండలంలోని మారుమూల లింగపురం గ్రామానికి చెందిన కాకా జోగరావుకి విద్య ఖర్చులకు నిమిత్తంఆధార్_సొసైటీ అండగా నిలుస్తూ ఫండ్ కలెక్షన్ చేయగా అన్ని సంఘాలు, మద్దత్తు దారుల నుండి దాదాపు 60 వేల రూపాయలు కలెక్ట్ అయ్యాయి. దానికి జతగా ఆధార్ సొసైటీ వారు 40 వేలు కలిపి మొత్తం ఒక లక్ష రూపాయలు కాక.జోగరావు విద్య ఖర్చుల నిమిత్తం ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు గొంది.వెంకటరమణ మరియు సీనియర్ నాయకులు మెట్ల.పాపయ్య అలాగే ఆదివాసీ మహిళ చైతన్య శక్తి రాష్ట్ర నాయకులు డా.పద్మజ, పూసం.వెంకటలక్ష్మీ, కోడి.నీలిమ గార్ల చేతుల మీదుగా కాక. జోగరావు కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు గొంది.వెంకటరమణ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ ఎంతో వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి ఒలింపిక్ ఛాంపియన్స్ ని తయారు చేసే ( నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్) లోని జాతీయ క్రీడా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందటం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాడు అని తెలిసి ఆధార్ సొసైటీ తరపున ఫండ్స్ కలెక్ట్ చేయగా, ఎందరో దాతలు సహృదయంతో స్పందించి దాదాపు 60 వేల వరకు ఫండ్స్ అందజేశారు. ఇందులో ఆదివాసీ ఉద్యోగులు, యువత, సింగరేణి కార్మికులు, వివిధ స్వచ్చంద సంస్థ వారు, సినీ ప్రముఖులు, ముఖ్యంగా భద్రాద్రి జిల్లా ఎస్.పి. సునీల్ దత్ , భద్రాచలం ఏ.ఎస్.పి వినిత్.జి మరియు ఇతర పోలీస్ శాఖ వారి సహకారం ఇలా అందరు పెద్ద మనసుతో స్పందించి ఆదివాసీ బిడ్డ చదువుకు ఏ ఆటంకం రాకుండా సహకారం అందించారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఆదివాసీ మహిళ చైతన్య శక్తి తరపున డా.పద్మజ , కోడి.నీలిమ , పూసం.వెంకటలక్ష్మి కూడా విద్యార్థి భవిష్యత్ బాగుండాలి అని ఆశీర్వదించారు. ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర నాయకులు బట్ట.వెంకటేశ్వర్లు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఆత్రం.నవీన్, మిషన్-1000 సభ్యులు గుమ్మడి.సుధీర్, గణేష్, చంటి, కొర్రి.కన్నం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: