CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం(NI-MSE) ఆధ్వర్యంలో ఆదివాసీలకి బ్యాoబో ( వెదురు) లతో తయారీ శిక్షణ తరగతులు.....

Share it:


  చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండల కేంద్రంలో (ఎన్ ఐ- ఎం ఎస్ ఇ ) ఆధ్వర్యంలో బ్యాoబో శిక్షణా తరగతులు చండ్రుగొండ రైతు వేదిక కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.సంస్థ సీఈవో జయశ్రీ మాట్లాడుతూ.... ఆదివాసులు అటవీ సంపదపై జీవనం సాగిస్తుంటారు. వారికి చేయూతగా వెదురుతో నూతనంగా బుట్టలు, కుర్చీలు, మంచాలు, ఇళ్లల్లో వెదురు తో అలంకరణ, వీటిని ఏ విధంగా చేయాలో మన దగ్గరగా ఉన్న వెదురుతో అనేక రకాల వస్తువులు తయారు చేయవచ్చు అన్నారు. దీనికి (ఎన్ ఐ-ఎం ఎస్ ఇ ) సంస్థ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, వి ఎం బంజర్, జూలూరుపాడు, ఏన్కూరు, సత్తుపల్లి ఈ మండలాలను కలిపి చండ్రుగొండ బ్యాoబో క్లస్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంస్థ ద్వారా ఆదివాసీలకు ఉపాధి సంపదను సృష్టించుకో కలుగుతారని, వారి అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మాధవరావు, టెక్నికల్ ఏజెన్సీ సురేష్, క్లస్టర్ సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, పల్లేరు వీరభద్ర గిరిజన సంస్థ అధ్యక్షులు ఈసం నాగభూషణం, ఎంపీటీసీ బొర్ర లలిత, సురేష్, వర్స శ్రీను, మల్లం కృష్ణయ్య మరియు ఏడు మండలాల శిక్షణ దారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: