CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేతన్ ఫౌండేషన్ వారి సహకారంతో దివ్యాంగ కుటుంబానికి ఆర్థిక చేయూత...

Share it:

 


👉 చేతన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం సర్పంచ్ ముక్తి 

నర్సింహరావు..


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండబోడు గ్రామ పంచాయతీకీ చెందిన కల్తీ సుధాకర్, భార్య వెంకట లక్ష్మి దివ్యాంగ కుటుంబం స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు సుమారు 15 వేల రూపాయలతో చేతన్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన కిరాణా దుకాణాన్ని నల్లబండబోడు గ్రామ సర్పంచ్ ముక్తి 

నర్సింహరావు, పంచాయతీ సెక్రటరీ బాబూలాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముక్తి 

నర్సింహరావు మాట్లాడుతూ.. చేతన్ ఫౌండేషన్ దివ్యాంగ కుటుంబానికి స్వయం ఉపాధితో ముందుకు వెళ్లేలా చేయూతను అందించడం అభినందనీయమని, అన్నారు. కరోన తో ప్రపంచం మొత్తం అనేక ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో దూర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడి ప్రజలకు నిత్యావసరాలు అందించటం, ట్రై సైకిళ్లు పంపిణీ, ప్రమాదంలో చేతులు కాళ్లు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు అందించటం, దివ్యాంగులు స్వయం ఉపాధితో ముందుకు సాగేలా ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు అందించటం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడి ప్రజలకు తోడుగా ఉంటున్న చేతన్ ఫౌండేషన్ సేవలు చాలా గొప్పవని, వీరి సేవలను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శి బాబూలాల్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు కాస్త చేయూతను అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో విజేఏసీ చైర్మన్,టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపునేని, విజేఏసి జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, జూలూరుపాడు మండల అధ్యక్షులు సున్నం కరుణాకర్ టివిపిఎస్ సభ్యులు కరుణాకర్, భాస్కర్, వీఆర్ఏ గోపమ్మ పిచ్చయ్య,బచ్చల లక్ష్మయ్య, రాఘవులు, రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: