CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వద్ద టిప్పర్ లకు పార్కింగ్ యార్డ్ కేటాయించాలి డ్రైవర్లకు క్లీనర్ లకు షెల్టర్ ఏర్పాటు చేయాలి సౌకర్యాలు కల్పించాలి ఐ.ఎఫ్.టి.యు నాయకులు మంగీలాల్

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

    సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వద్ద బాడీ బండ్లకు టిప్పర్ లకు పార్కింగ్ కై యార్డ్  కేటాయించాలని డ్రైవర్ల సౌకర్యార్థం షెల్టర్ నిర్మించాలని తాగునీటి వసతి కల్పించాలని ఐ ఎఫ్ టి యు ఏరియా నాయకులు ఏ మంగీలాల్ సింగరేణి యాజమాన్యాన్ని  కోరారు, గురువారం సాయంత్రం సింగరేణి మెయిన్ చెక్

    (MCH) పోస్ట్ వద్ద BTPS టిప్పర్ డ్రైవర్ ల తో కలిసి  ఆయన విలేకరులతో మాట్లాడారు, ఓ సి 4  నుండి BTPS కు  రోజుకి వందకుపైగా లారీలు బొగ్గు రవాణా చేస్తున్నాయని ట్రాఫిక్ నియంత్రణ కై  లారీలను టిప్పర్ లను సింగరేణి మెయిన్ చెక్పోస్ట్ వద్ద ప్రధాన రహదారి పైనే నిలిపివేయడంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదని 40 నుంచి 50 లారీలను  ఇక్కడ పార్కింగ్  చేయడం మూలంగా రద్దీ తో పాటు డ్రైవర్లకు క్లీనర్ల కు  ఇక్కడ ఎలాంటి వసతి  లేకపోవడంతో పాటు త్రాగు నీరు కూడా అందుబాటులో లేదని దీంతో మోటార్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని వర్షం వస్తే వీళ్ళ కష్టాలు చెప్పనలవి కాదనీ ఆయన అన్నారు మెయిన్ చెక్పోస్ట్ నుండి GM కార్యాలయం వరకు  సత్వరమే రోడ్డు వెడల్పు తో పాటు రద్దీ నియంత్రణకు టిప్పర్ల కు లారీలకు పార్కింగ్ యార్డ్ కేటాయించాలని, షెల్టర్  నిర్మించాలని కోరారు, అలాగే ఓ సి స్టోర్ వద్ద కూడా దూర ప్రాంతాల నుంచి భారీ యంత్రాలు సామాగ్రి తీసుకువచ్చే లారీల డ్రైవర్లకు క్లీనర్ లకు వసతులు లేకపోవడంతో కరోనా సమయంలో వారు మరింత ఇబ్బంది పడ్డారని స్టోర్ వద్ద కూడా లారీలకు పార్కింగ్ నిర్మించడంతో పాటు డ్రైవర్ క్లీనర్ లకు షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు,మెయిన్ చెక్ పోస్ట్ కు  సమీపంలోనే బెల్టుషాపులు ఉన్నాయని మూడు పూవ్వులుగా ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయనీ మైన్స్ కి  వైన్స్ దగ్గర ఉండటం అంటే కార్మికుని మద్యం సేవించ మని రా రా రమ్మని పిలవడమే నని ప్రమాదాలను   ప్రోత్సహించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, సత్వరమే ఈ విషయం పై కూడా సింగరేణి యాజమాన్యం, పోలీసులు  ఎక్సైజ్ శాఖ, స్పందించాలని కోరారు ,ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు  డి పూర్ణచంద్రరావు, నాగరాజు, సాయి చరణ్, విజయ్ మరియు డ్రైవర్ లు రామకృష్ణ,లవ కుమార్ 

    ఎస్ వెంకట్ ,సిహెచ్ వినోద్ ,సురేష్ ,హరికృష్ణ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: