CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ మహిళలకు పురుడుపోసిన అంగన్వాడీ కార్యకర్త

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 



భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం పంచాయతీలోని వలస ఆదివాసి గ్రామం టేకులగూడెం. ఆ గ్రామంలోని మినీ అంగన్వాడీ కేంద్రంలో చంద్రకళ అంగన్వాడీ కార్యకర్త. రోజు లాగానే సోమవారం రోజున విధులకు హాజరైంది. అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన పోడియం బండి భార్య అయిన భీమమ్మ పురిటి నొప్పులతో బాధ పడుతుంది అని తెలుసుకుని, వారి ఇంటికి వెళ్లి గమనించి, పినపాక లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళదామని చెప్పడం జరిగింది. ససేమిరా అన్న ఆ మహిళ, ఇంటిలో నొప్పులతో బాధపడుతూ ఉంటే, అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ శిక్షణా తరగతులలో తెలుసుకున్న విధంగా, ఆ మహిళకు అన్నీ తానై సపర్యలు చేసి పురుడు పోసింది. ఆదివాసీ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆశ కార్యకర్త లావణ్య టేకులగూడెం చేరుకొని, బాలింతను తీసుకొని, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి, ప్రాథమిక చికిత్సను అందించి, ఇంటికి పంపి వేయడం జరిగిందని అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ చేసిన పని పట్ల పలువురు అభినందిస్తున్నారు..

Share it:

Post A Comment: