CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండల కేంద్రంలో హైదరాబాద్ లోని సింగరేణి కాలనిలోని చైత్ర అనే 6 సవత్సరాల గిరిజన బాలికను రాజు అనే దుర్మార్గుడు అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మంగపేట మండలంలోని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా మంగపేట బస్టాండ్ నుండి మూలమలుపు వరకు ర్యాలీ నిర్వహించి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పది నిముషాలు మౌనం పాటించడం జరిగింది.ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి బుచ్చంపేట మాజీ సర్పంచ్, మాజి ఆత్మ చైర్మన్ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల అధికార ప్రతినిధి బండ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ చైత్రను హత్య చేసిన దుండగున్ని ఉరితీయాలని,వారి కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రగటించాలని,మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోజ్వాలా యూత్ ప్రెసిడెంట్ అంబెడ్కర్ పెలోషిప్ అవార్డు గ్రహీత కోడెల నరేష్, వర్తకసంఘం మండల అధ్యక్షులు కొమరగిరి కేశవరావు,బహుజన సమాజ్ పార్టీ ములుగు జిల్లా ఆర్గనైజింగ్ మినిస్టర్ ఎంపెళ్లి వీరస్వామి,జె ఏ సి అధ్యక్షుడు పొలసాని ఆశోక్ రెడ్డి ,ములుగు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కర్నే రమేష్, బి ఎస్ పి మంగపేట మండల సెక్టార్  అధ్యక్షుడు బండి లక్ష్మణ్ , , ,స్వేరోస్ జిల్లా నాయకులు బసారికాని నాగార్జున,బి ఎస్ పి మంగపేట మండల ప్రధానకార్యదర్శి మంద సతీష్, వర్తక సంఘం మండల నాయకులు తిరుపతయ్య,తెరాస మండల మాజీ అధ్యక్షురాలు ఆళ్ల రాధారాణి, మహిళ సంఘం నాయకులు సావిత్రి,గౌడ సంగం మండల నాయకులు రాజు,బీసీ నాయకులు చిప్ప లక్ష్మిపతి ,శోభన్ రాహుల్,అఖిల్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: