CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిండు ఆరోగ్యమే సంతోషకరమైన జీవితానికి పునాది డి డబ్ల్యూ ఓ ప్రేమ లత

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం వాడగూడెం లో పోషక ఆహార వారోత్సవాలు సందర్బంగా డి డబ్ల్యూ ఓ ప్రేమలత మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషక ఆహరం యొక్క ప్రాముఖ్యత తల్లులకు గర్భిణీ స్త్రీలకు వివరించాలని నిండు ఆరోగ్యమే సంతోషకరమైన జీవితానికి పునాది అని ఈ సందర్బంగా తెలియజేసారు. దేశం ఎదుర్కొoటున్న ప్రధాన సమస్యలలో పోషణ సమస్య ఒకటి,

దేశంలో 1/3వంతు వయోజనులలో పోషకాహార లోపం ఉంది,

50%పిల్లలలో పోషకాహార లోపం ఉంది,

తల్లుల్లో పోషకాహార లోపం ఉంది, అందువలన తక్కువ బరువుతో జన్మించిన శిశువులను మనం గమనించవచ్చు,

సరైన నవజాత శిశువులు, చిన్నపిల్లల పోషణ, సంరక్షణ పద్ధతులు తు చ తప్పకుండ పాటించవలెను,

ఇప్పుడు ఉన్న సమస్య వ్యాధి నివారణకు, ఆరోగ్యసంరక్షణకు సరైన వసతులు లేకపోవడం,

పోషణ గురించి, ప్రాంతీయంగా దొరికే పోషకహారం, ఏఆహరంలో ఏయే పోషకాలు అందుతాయో, తల్లులకు, గర్భిణీ స్త్రీలకు వివరించాలి, కిశోర బాలికల పోషణ, ఆరోగ్యం పై తగిన శ్రద్ద చూపించాలని తల్లి దండ్రులకు వివరించాలి, ముఖ్యంగా రక్షిత మంచి నీరు శానిటేషన్ వసతులు లేకపోవడం ప్రధాన సమస్య అయినప్పటికీ ఉన్నదానిలో రక్షితమైన నీటిని త్రాగాలని, పరిశుభ్రత పాటించాలని అంగన్వాడీ లబ్ది దారులకు వివరించాలని ఈ సందర్బంగా అంగన్వాడీ టీచర్లకు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో సి డి పి ఓ హేమలత చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సూపర్వైజర్లు విజయలక్ష్మి, సక్కుబాయి, శ్రావణి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: