CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి *భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం.

Share it:

 


సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

*భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం.

మన్యం టీవీ ఏటూరు నాగారం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తాసిల్దార్ రవీందర్ కు వినతి పత్రం అందజేశారు.అంతరం గండేపల్లి సత్యం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని అన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే మన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 న విమోచనం కలిగిందని అన్నారు నిజాం పరిపాలిస్తున్న హైదరాబాదు సంస్థానంలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో మరి కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో ఉన్నాయని అక్కడ సెప్టెంబర్ 17న అధికారికంగా జరుగుతుందని,తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నిర్వహించడం లేదు అని రాష్ట్రం ఏర్పడక ముందు అధికారికంగా జరుపుతామని ముఖ్యమంత్రి మాట ఇచ్చి మర్చిపోయారని,నిజాం పాలన అంతం చేసిన అప్పటికి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణను రాక్షస పాలన నుండి విముక్తి కలిగించారని అందుకు సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఏటూరు నాగారం మండల కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కర్నె సంపత్,మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు, మండల యువ మోర్చా అధ్యక్షులు చక్రవర్తి,కిసాన్ మోర్చా అధ్యక్షులు 

కందడి ఎలెందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: