CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రశ్నించే గొంతుకను విమర్శిస్తే సహించేది లేదు

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగళవారం రోజున మంగపేట  మండల కేంద్రంలో ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య  అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అయ్యరి యానయ్య   మాట్లాడుతూ ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఐటిడిఏ లో జరుగుతున్న అవకతవకలను అడ్డుకోవడం లేదని ఆదివాసీ తుడుమ్  దెబ్బ విద్యార్ది సంఘ  రాష్ట్ర అద్యక్షులు దబ్బకట్ల  సుమన్ ఆరోపించడం తన తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థి సంఘం అని చెప్పుకోవడం కాదు అందరికీ ఆదర్శంగా ఉండాలని అధికార పార్టీకి తొత్తులుగా మారి సీతక్క పై తప్పుడు మాటలు ఆరోపించడం అతని తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు. అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించడము సరైన పద్ధతి కాదని ఇది నీచ మైన పధ్ధతి అని దుయ్యబట్టారు. చేతనైతే అధికార పార్టీ గిరిజన మంత్రిని  నిలదీయాలని అన్నారు అంతే కానీ ఒక ఆదివాసి ఎమ్మెల్యే నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఎన్నోసార్లు అసెంబ్లీలో ఏజెన్సీ ప్రాంత రోడ్ల, పోడు భూముల అన్నీ రకాల సమస్యల కోసం సీఎంని ప్రశ్నించిన  ప్రతిపక్ష ఎమ్మెల్యేను విమర్శించడం ఎంతవరకు సబబు అన్నారు.రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా విద్యార్థులకు ఏమి చేశారు చెప్పాలని ప్రశ్నించారు. మేడారం జాతర వస్తున్నందున అధికార పార్టీ మెప్పు పొందాలని ఇలాంటి చౌకబారు నీచ రాజకీయాలు చేయడం వెనుక అంతరార్ధం ఏమిటో మాకు తెలుసు అన్నారు. ఇలాంటి చౌకబారు నీచ రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుకుట్ల నరేందర్,మైనార్టీ సెల్ అధ్యక్షులు హిదయతుల్లా,బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మైనార్టీ జిల్లా నాయకులు  మెహబూబ్ ఖాన్, సీనియర్ నాయకులు కారు పోతులు నర్సయ్య,గౌడ్ దామెర సారయ్య,ఆక తిరుమల రావు, పిండిగ నాగరాజు, ఊకే అజయ్, కుమార్ మండల సర్వయ్య, కోరం లక్ష్మీపతి, నాగార్జున, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: