CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉వర్షం జోరు - కుటుంబాలు బేజారు!

Share it:


👉నీట మునిగిన విద్యానగర్ కాలనీ ఇలానే మరి కొన్ని ప్రాంతాలు జలమయం.

 👉జోరు వానలో రోడ్లపై చేపలు పడుతున్న వైనం.

👉డ్రైనేజీ, కబాల వల్లనే ఈ దుస్థితి అంటున్న జనం.

 👉వరదలు పారిన ఏరియాలను అధికారులు నందర్శించాలి - పరిహారం ఇవ్వాలని బాధితు కుటుంబాల వేడుకోలు.

 భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6(మన్యం టీవీ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆగకుండా ఏకదాటిగా ఏడు గంటల పాటు వర్షం కురువడంతో భీవత్స వాతావరణం ఏర్పడింది. సోమవారం ఉదయం 6 గంటలకు మొదలైన భారీ వర్షం మధ్యాహ్నం 1 గంట వరకు కురిసింది. వర్షం జోరు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్, రాంనగర్ గ్రామ పంచాయతీల్లో పెద్ద మొత్తంలో వరద పారింది. ఇండ్లల్లోకి వరద చేరడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇండ్ల ప్రక్కనే డ్రైనేజీలు పొంగి ఆ నీరంతా గృహాలలోకి ప్రవేశించడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాల వస్తువులు వరద నీటిలో కొట్టుకుని పోయాయి. వస్తువులు నీటిలో కొట్టుకుపోవడంతో వాటిని పట్టుకునేందుకు మహిళలు సహనం చేసిన ఫలితం లేకుండాపోయింది.

రాంనగర్ 12వ వార్డు లో బొంకురి లక్ష్మి ఇల్లు నేలమట్టం అయింది. అంతేకాకుండా చుంచుపల్లి మండల సమీపంలో ఉన్న పంటల పొలాలు సైతం వరదనీటిలో మునిగాయి. పొలాల్లో చేరిన వరద నీటిని చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ప్రాంతంలో సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకనే భారీ వర్షానికి కాలనీలోని రహదారులు మునిగి ఇండ్లల్లోకి నీరు చేరిందని వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఇకపోతే లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా పైన పేర్కొన్న విధంగానే లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. కొన్ని ఇండ్లకు సంబంధించిన ప్రహరి గోడలు కూలిపోయాయి. వర్షం భీవత్సంకు ప్రజలు అతలాకుతలమయ్యారు. ఇండ్లల్లోకి వచ్చిన వరద నీటిని స్టీల్ గిన్నెలతో మహిళలు తొలిగించుకుంటున్న దృశ్యాలు కన్పించాయి. రాంనగర్ చెరువు కుంట నుంచి తుమ్ ద్వారా ఖమ్మం రహదారిపై ప్రవహిస్తున్న నీటిలో చాపలు పట్టిన వైనం, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షం వల్ల స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి చెరువుగా మారింది. ఏకదాటిగా ఏడుగంటల పాటు కురిసిన వర్షంతో అండర్ బ్రిడ్జిలోకి సగం వరకు వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మరికొన్ని వాహనాలు అయితే బ్రిడ్జి మధ్యలోనే ఆగిపోయాయి. వరద నీటిలో ఆగిపోయిన వాహనాలను యంత్రాల సహాయంతో వాటిని బయటకు తీశారు. ఇక్కడ కూడా డ్రైనేజీ నరిగ్గా లేకనే ఈ దుస్థితి నెలకొంటుందని జనం మండిపడుతున్నారు. బ్రిడ్జికి ఒకవైపే డ్రైనేజీ ఉన్న కారణంగా వర్షకాలం సమయంలో వరదనీరు డ్రైనేజీ నుండి పూర్తి స్థాయిలో బయటకుపోలేని పరిస్థితి ఉందని వాహనదారులు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. జిల్లా కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి వరదనీరు ఇండ్లల్లోకి వచ్చి వంట సామాగ్రితో పాటు ఇతర వస్తువులు కొట్టుకుపోయాయని, కాలనీలోని రహదారులు దెబ్బతిన్నాయని వీటిని అధికారులు దృష్టిలో పెట్టుకొని మండలాల్లో, గ్రామ పంచాయతీల్లో అధికారులు పర్యటించి వరదలతో ఇబ్బంది పడిన ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకొని పరిహారం ఇచ్చే విధంగా చూడాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితిని బట్టి కాలనీల్లో మరమ్మత్తులు నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Share it:

Post A Comment: