CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ ఉపాధ్యాయుని ఘనంగా సన్మానించిన, ఉపాధ్యాయ బృందం

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గురువారం రోజున తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5,2021 గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు పురస్కార అవార్డు గ్రహీత,సామాజిక సేవకులు,కోరగట్ల రవీందర్ ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులను మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం తెలంగాణ టీచర్స్ ములుగు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సర్వర్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కన్నాయిగూడెం మండల తహశీల్ధార్ దేవ్ సింగ్ మరియు మండల అభివృద్ధి అధికారి ఆడూరి బాబు మరియు టీఎస్-ఏటిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద రఘుపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండల మ్యాజిస్ట్రేట్ మరియు తహసీల్ధార్ మాట్లాడుతూ సమాజములో ఉత్తమ వ్యక్తులుగా,గొప్పవారు గా నిలబడాలంటే విద్యాబుద్ధులు కారణం అన్నారు.ఇ విద్యా బుద్ధులు చెప్పే గురువులు సమాజములో గొప్పవారని కొనియాడారు.కొరగట్ల రవీందర్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడం గర్వకారణం అన్నారు.మారుమూల ప్రాంతాలలో అర కొర వసతుల మధ్య చదినవారు,ఈ స్థాయిలో రాణించడం గర్వించదగిన విషయం అన్నారు.32 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తితో పాటు సామాజిక సేవలో పాలుపంచుకొనడం అభినందనీయం అన్నారు.అలాగే స్థానిక మండల అభివృద్ధి అధికారి ఆడూరి బాబు మాట్లాడుతూ గత 32 సంవత్సరాల నుండి వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ,ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిన వారు ఉన్నత స్థాయిలలో ఉద్యోగాలు చేస్తూ చేస్తున్నారని వారు అన్నారు.అలాగే గురువు బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సమానం అని అన్నారు.తల్లి మొదటి గురువు మరియు దైవం అయితే గురువు రెండవ ఉపాధ్యాయుడు అని అన్నారు.అలాగే మారుప్రాంతాలలో మరిన్ని వసతులు కలిపిస్తే ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు అని అన్నారు. అలాగే టీఎస్- ఎటీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద రఘుపతిరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతములో ప్రభుత్వ పరంగా పాఠశాలలలో మౌలిక వసతులు కలిపిస్తే ఉపాధ్యాయలు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారని మరియు పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధముగా అధికారులు దృష్టిసారించాలని అన్నారు.అనంతరం సన్మాన గ్రహీత అయిన కోరగట్ల రవీందర్ ను తహశీల్ధార్,ఎంపీడీఓ మరియు ఉపాధ్యాయులు బృందం ఘనంగా సన్మానించారు.

ఈ కార్యాక్రమములో చింతగూడెం పాఠశాల ఎస్ఎం ఎస్ చైర్మన్ సునరకాని నారాయణ,రాజన్నపేట సర్పంచ్ ప్రభాకర్,టియుటి డబ్ల్యూ మండల బాధ్యులు గొంది బిక్షపతి,కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్, ఉపాధ్యాయులు పోశెట్టి రామారావు,పర్వతాల

భిక్షపతి,అబ్బు శ్రీను, రాజమౌళి,ఇరుసవడ్ల జగన్,పర్వతాల సతీష్ తుడుందెబ్బ మండల అధ్యక్షులు గుండ్ల పాపారావు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: