CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గంలో ని ప్రతి పల్లెను అడుగండి

Share it:

 


👉 గత పాలకులు పినపాక నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఎంత? రేగా కాంతారావు  అనే నేను చేసిన అభివృద్ధి ఎంత?

మీరు చెబితేనే 100 పడకల ఆసుపత్రి తీసుకవచ్చనా?

👉ఆనాడు ఓ కమ్యూనిస్టు గిరిజన ఎమ్మెల్యేని సీపీఐ నాయకులు బానిసగా చూడలేదా?

👉ఆ ఎమ్మెల్యే మీ తీరు పట్ల కంటతడి పెట్టింది వాస్తవవం కాదా!

👉వెట్టిచాకిరి చేయించుకున్న కమ్యూనిస్టు నాయకులు మతి భ్రమించి ఆరోపణలు

కమ్యూనిస్టులు,ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి

నియోజకవర్గ వెనుకబాటుకు కారణం కమ్యూనిస్టు లు కాదా:విప్ రేగా

20 సంవత్సరాల పరిపాలనలో కమ్యూనిస్టులు ఏం అభివృద్ధి చేశారు

నియోజకవర్గ అభివృద్ధి కనబడని కళ్ళులేని కబోదు లారా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమా:విప్ రేగా


సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక విలువ,స్థాయి మీకు లేదు:  మన్యం టీవి తో విప్ రేగా కాంతారావు


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,ఉద్యమ నాయకులు,సీఎం కెసిఆర్ సారథ్యంలో లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ,పేద ప్రజల సంక్షేమం లి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.ప్రజల వద్దకే పాలన అనే విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకుని,నూతన పంచాయతీలను, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకుని,సంక్షేమాన్ని పేద ప్రజలకు అందజేయడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లోని పంచాయతీల ద్వారా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను సాక్షాత్తు కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రశంసించారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతాంగానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.కులాలకు,మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు విద్య అందించడం కోసం అనేక నూతన కళాశాలలు,పాఠశాలలు,రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఐటిఐ కాలేజీలు,డిగ్రీ కాలేజి లని ఏర్పాటు చేశామని తెలిపారు.వైద్యం కోసం,పేద ప్రజల ఆరోగ్యం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు.ప్రజలకు 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని,మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఏ మంచినీరు అందిస్తున్నామో, మారుమూల గిరిజన గూడెంలకు,గ్రామాలకు,  కూడా అవే మంచి నీరు అందిస్తున్నాము అని తెలిపారు.మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అందివ్వాలని కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లాంటి పథకాల అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు,నేతన్నలు,గితన్నలు ఆత్మహత్యలు, కవులు కళాకారులు రాసిన పాటలు,ఈ రోజు తెలంగాణ లో ఆ పరిస్థితులు లేవని, ఏడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని విప్ రేగా కాంతారావు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్,టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.పినపాక నియోజకవర్గం లో ఇప్పటికే సీతమ్మ సాగర్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నామని,ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తి చేశారని,త్వరలో ప్రారంభం కూడా చేసుకుంటామని అని తెలిపారు.వర్షాకాలం ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద మీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది అని,ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలని, సీఎం కేసీఆర్ సీతమ్మ సాగర్ నిర్మాణం చేపట్టాలని అదేశించారని,దానికి సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయని త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు.సీతమ్మ సాగర్ నిర్మాణం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ నిల్వ ఉంటుందని,తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కాళేశ్వరం,పాలమూరు,సమ్మక్క బ్యారేజీ,సీతమ్మ బ్యారేజీ లపై టూరిజం, ప్లాంటేషన్,సినిమా షూటింగ్ లు చేసుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అని తెలిపారు.ఇప్పటికే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిందని,డిస్కవరీ ఛానల్ లో లిఫ్టింగ్ ఏ రివర్ అని కాలేశ్వరం ప్రాజెక్ట్ గురించి డాక్యుమెంటరిని చేసిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీరు అందించడంతో పాటు, రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగింది అని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వాగులు వంకలు పై సుమారు 50 కోట్ల రూపాయలతో చెక్ డ్యాములు నిర్మించామని, తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. నియోజకవర్గం లోని, గుండాల మండలం వెళ్లడానికి నూతనంగా రహదారులు నిర్మించామని, వాగుల పై నూతనంగా బ్రిడ్జి లను నిర్మించామని,ఇటీవలే వాటిని మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ద్వారా అనేక మంది కి ఉద్యోగ ఉపాధి కలుగుతుందని,ఇప్పటికే 346 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని విప్ రేగా కాంతారావు తెలిపారు. ప్రైవేట్ వ్యాపారస్తులకు కు కూడా అనేక విధాలుగా ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.ప్రతిపక్షాలు మాట్లాడే వంద పడకల ఆసుపత్రి సృష్టికర్త నేనే అని విప్ రేగా కాంతారావు అన్నారు.నియోజకవర్గ వెనుకబాటుకు కమ్యూనిస్టులే కారణమని ఆయన తెలిపారు.20 సంవత్సరాల పరిపాలనలో కమ్యూనిస్టు నాయకులు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు.20 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని ఆస్పత్రులు నిర్మించారని, అని ఆయన విమర్శించారు. అర్థంలేని ఆరోపణలు చేసి, కమ్యూనిస్టులు వారి జీవనం,మనుగడ కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు అని,ఇప్పటికే కాలగర్భంలో కమ్యూనిస్టులు కలిసిపోయారని,ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు.  ప్రజా సమస్యలపై, నియోజకవర్గ అభివృద్ధి పై జిల్లా అభివృద్ధి పై కూడా పూర్తి స్థాయి అవగాహన, పరిజ్ఞానం ఉందని విప్ రేగా అన్నారు.20 సంవత్సరాలలో ఒక్క హాస్పిటల్ అయినా కట్టారా అని ఆయన ప్రశ్నించారు.రామానుజవరం లో హాస్పిటల్ ను శాంక్షన్ చేస్తే,రద్దు చేయించారని, ఇంటి ముందు రోడ్డు లేకపోతే,నేను రోడ్డు శాంక్షన్ చేస్తే అదే రోడ్డుపై నిలబడి ఈరోజు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వల్ల పినపాక నియోజకవర్గం ఏ కాదు, యావత్ రాష్ట్రం,దేశం, ప్రపంచం కూడా ఇబ్బందులకు గురైన విషయం ప్రజలందరికీ తెలుసని,మీరు చేసే అర్థంలేని ఆరోపణలు మీ వ్యక్తిగత స్వార్థం కోసంమేనని,ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ఆదివాసీలు,గిరిజనుల పట్ల, అన్ని వర్గాల ప్రజల పట్ల, చిత్తశుద్ధితో పని చేస్తున్నామని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజన్సీ ప్రాంతం అని,ప్రజలు పెద్ద వైద్యం కోసం హైదరాబాద్ దాకా వెళ్లాల్సి వస్తుందని,సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళగానే,వెంటనే జిల్లా కు మెడికల్ కాలేజీలో శాంక్షన్ చేశారని,జిల్లా ప్రజలు అందరు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని తెలియజేశారు.కొత్తగూడెం, భద్రాచలం హాస్పిటల్ లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకొని,ప్రారంభించనున్నామని,త్వరలోనే మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభించుకుంటామని,ఈ సందర్భంగా విప్ రేగా తెలిపారు.ఇప్పటికే జిల్లాలోని అన్ని హాస్పటల్ లో వైద్య సిబ్బంది కోసం నోటిఫికేషన్లు ఇచ్చామని ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కాంట్రాక్ట్ బేసిక్ కాదని పర్మినెంట్ ఉద్యోగాలు అని,ఇంకా అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలి రేగా కాంతారావు తెలిపారు. మణుగూరు వంద పడకల హాస్పిటల్ కు ఇప్పటికే 13 మంది ఏ ఎన్ ఎం లు సేవలు అందిస్తున్నారని,ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని,ఇప్పుడొచ్చిన నోటిఫికేషన్ ద్వారా 10 మంది డాక్టర్లును మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని,ఇద్దరు డాక్టర్లు నైట్ షిఫ్ట్ లో అందుబాటులో ఉంటారని,మిగిలిన ఎనిమిది మంది డాక్టర్లు నిరంతరం సేవలు అందిస్తారని తెలిపారు.పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 52 రకాల టెస్టులను ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తున్నారని,ఇటీవల కొత్తగూడెం హాస్పిటల్ లో ప్రారంభించుకున్నామని,మణుగూరు హాస్పిటల్ లో కూడా టెస్ట్ లకు సంబంధించిన అన్ని రకాల,అధునాతన పరికరాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ సారథ్యంలో కెసిఆర్ చచ్చుడా,తెలంగాణ వచ్చుడా,అనే నినాదంతో ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానేత సీఎం కేసీఆర్ అని,గొప్ప చరిత్ర ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీని వారిని విమర్శించే స్థాయి, అర్హత మీకు లేదని ఆగ్రహం ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని కమ్యూనిస్టులు రోజులు మారాయి అని, ప్రజలలో చైతన్యం వచ్చింది అని,విలువలతో కూడిన రాజకీయాలు చేయండి కానీ,చిల్లర రాజకీయాలు చేయవద్దని పేర్కొన్నారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై,నియోజకవర్గ అభివృద్ధి పై అంబేద్కర్ సాక్షి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి, పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,ఎంపీటీసిల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుకు ఏనిక.ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ నాయకులు, పుచ్చకాయల శంకర్, వట్టం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: