CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణలో మహిళలకు రకణ ఏదీ?

Share it:

 


 - *ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, హత్యలు

 *-దీనికి అంతంలేదా..? ప్రభుత్వం ఉన్నట్టా, లేనట్టా!

 *-చైత్ర తల్లిదండ్రులకు కోటి ఆర్ధిక సహాయం అందజేయాలి

 *-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ కొలువు ఇవ్వాలని డిమాండ్ 

 *-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ఫౌండేషన్ అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్ డిమాండ్

 *-హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో చైత్ర కుటుంబానికి భారతి ప్రతాప్ పరామర్శ


 మన్యం టీవి, అశ్వరావుపేట: ఇది ప్రభుత్వం విజయం కాదని.. ప్రజల విజయమని.. మహిళా సంఘాల పోరాట వలనే నిందితుడికి వణుకు పుట్టి రాజు మరణించాడని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్ అన్నారు. గురువారం హైదరాబాద్ సైదాబాద్లో సింగరేణి కాలనీలో నివాస ముంటున్న చైత్ర కుటుంబాన్ని వేముల భారతి ప్రతాప్ పరామర్శించారు. ఈ సందర్భంగా భారతి ప్రతాప్ మాట్లాడుతూ కామాంధుడైన చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తి తప్పించుకొని తిరుగుతుంటే ఆ వ్యక్తిని వెంటనే పట్టుకొని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా దిశ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేసిన ఫలితంగానే కామాంధుడిలో వణుకు పుట్టిన మరణించాడని ఆరోపించారు. చిన్నారి హత్య జరిగి రోజులు గడిచిన తరువాత ఆలస్యంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించడం సిగ్గుచేటన్నారు. జరిగిన ఘటనపై సత్యవతి రాథోడ్ ను నిలదీసినట్లు పేర్కొన్నారు. బాధితకుటుంబానికి వెంటనే కోటి రూపాయల ఆర్ధిక సహాయం అందించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని వేముల భారతి ప్రతాప్ సత్యవతి రాథోడ్ ను డిమాండ్ చేశారు. హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిందన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే ఒక అధికారిపై చర్య తీసుకున్నారని, ఇప్పుడు ఒక చిన్నారి దారుణ హత్యకు గురైతే ముఖ్యమంత్రిలో చలనమే లేదన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆడవారు బయటకు రావాలంటనే వణికిపోతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన అధ్వానంగా ఉందన్నారు. ధరల దరువుతో పాటు పథకాలు కూడా పేదలకు సక్రమంగా అందడం లేదన్నారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ఇక భూ దందాలకు అయితే అడ్డు అదుపే లేదన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి, ఇల్లు కేటాయించడంతో పాటు కోటి ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. అదే విధంగా సింగరేణి కాలనీలో, ఇతర ప్రదేశాల్లో ఇలాంటి దురదృష్టమైన సంఘటనలకు కారణమవుతున్న గంజాయి, డ్రగ్స్ ని రాష్ట్రంలో చలామణి కాకుండా కఠినంగా వ్యవహరించాలని దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్ డిమాండ్ చేశారు.

Share it:

Post A Comment: