CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక మండలంలో విప్ రేగా కాంతారావు విస్తృత పర్యటన

Share it:

 


👉ఉదయం 9 గంటల నుండి, సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా పరామర్శలు

👉 పలు ప్రజా సమస్యల పరిష్కారం

👉 ప్రతి కార్యకర్త కు అండగా ఉంటా

👉 పినపాక నియోజకవర్గం నూరు శాతం అభివృద్ధి చెందే వరకు విశ్రమించేది లేదు

విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

మన్య టీవి, పినపాక: 

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక మండలం లో ఆదివారం రోజున విస్తృతంగా పర్యటించి, పలువురు కార్యకర్తలు, అభిమానులను పరామర్శించడం జరిగింది. ఉదయం 9 గంటలకే ప్రారంభించిన పరామర్శ కార్యక్రమం తోగ్గూడెం గ్రామంలో ప్రారంభమై, నాలుగు గంటలకు ఎల్చిరెడ్డిపల్లి  గ్రామంలో ముగిసింది. తోగ్గూడెం గ్రామంలో వల్లెపు కృష్ణ డెంగ్యూ వ్యాధితో బాధపడి, ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో పరామర్శించి, భరోసా కల్పించారు. అదే గ్రామానికి చెందిన పుప్పాల రమాదేవి కి కొన్ని సంవత్సరాల నుండి తలసేమియా వ్యాధి తో బాధ పడుతుంది అని తెలుసుకొని, నిమ్స్ ఆసుపత్రి వైద్యుల తో మాట్లాడటం జరిగింది. అనంతరం మల్లారం గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కొత్తపల్లి సతీష్ కుటుంబాన్ని పరామర్శించి, పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి చేతులమీదుగా 50 కేజీల బియ్యం ఇప్పించడం జరిగింది. అదే గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మరణించిన కేసులో జైలు పాలైన వారిని పరామర్శించి, సమాజంలో జరిగే అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సలహా ఇవ్వడం జరిగింది. అనంతరం పాండురంగాపురం పంచాయతీలోని విప్పల గుంపుకు చెందిన మద్దెల జగన్, కరోనా వ్యాధితోమరణించడం వల్ల, ఆయన కుటుంబానికి భరోసా కల్పించి, రాబోయే కాలంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం అమరారం పంచాయతీ ఎంపీటీసీ ఖాయం శేఖర్ ను పరామర్శించి, కొత్తూరు గ్రామంలో ఇటీవల వాహన ప్రమాదంలో కాలు కోల్పోయిన బిజ్జా రమేష్ ను పరామర్శించారు. కిష్టాపురం పంచాయితీలో ఉన్న పూనెం నరసింహారావు లను, అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తిని పరామర్శించి 25 కేజీల బియ్యాన్ని ఇప్పించడం జరిగింది.సింగిరెడ్డి పల్లి గ్రామంలో పాముకాటుతో మరణించిన తులసి గారి సత్యవతి కుటుంబాన్ని పరామర్శించి, అదే గ్రామంలోని ఒక వ్యక్తి కరోనాతో మరణించడంతో, అతనికి సంబంధించిన రైతుబీమా ఆలస్యం గురించి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చే భీమా వర్తించే విధంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎల్చిరెడ్డిపల్లి పంచాయితీ సర్పంచ్ నూపా నాగభూషణం చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తెలుసుకొని, పరామర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,  ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, దాట్ల వాసు బాబు, పోలిశెట్టి సత్తిబాబు, దినసరపు శ్రీనివాస రెడ్డి, ఎంపీటీసీ చింతపంటి సత్యం,  హరీష్, కో ఆప్షన్ సభ్యులు జహంగీర్,పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సందీప్ రెడ్డి, పటేల్ కామేష్, మీరా సాహెబ్, ఉడుముల రవీందర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహారావు, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Share it:

Post A Comment: