CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పగిడేరుకు వన్నెతెచ్చిన ఆదివాసి ఆణిముత్యం

Share it:

 రేవా యూనివర్సిటీ నుండి గోల్డ్ మేడల్ అందుకున్న దళిత బిడ్డ:సివిల్స్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న కర్నె హిమబిందు*


మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, పగిడేరు పంచాయతీలోని శాంతినగర్ గ్రామానికి చెందిన కర్నె.భాస్కర్,సైదమ్మ దంపతుల కుమార్తె హిమబిందు గోల్డ్ మెడల్ సాధించి పగిడేరు గ్రామానికి వన్నెతెచ్చిన ఆణిముత్యం.2020-21 రేవా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.ఈ నెల 15వ తేదీ కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ సిఎన్.యశ్వంత్ నారాయణ,నేషనల్ అవార్డ్ ఆఫ్ అక్రిడేషన్ చైర్మన్ న్యూఢిల్లీ ప్రొఫెసర్ కేకే.అగర్వాల్,రేవా యూనివర్సిటీ ఛాన్స్ లర్ డాక్టర్ బి.శ్యామ్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ను అందుకుంది. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన వారి కుటుంబం,మణుగూరు ఓ సి-2 ప్రభావం వల్ల బ్రతుకుతెరువు కోసం పగిడేరు. శాంతినగర్ కు వెళ్లారు.భాస్కర్, సైదమ్మ దంపతులు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని,వారు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి ఆటో డ్రైవర్ గా,కార్ డ్రైవర్ గా అనేక పనులు చేసుకుంటూ తమ పిల్లల ఉన్నత చదువుల కోసం పాటు పడుతున్నారు.పిల్లల కోసం అనునిత్యం పరితపించే తల్లిదండ్రులను చూసిన హిమబిందు ఉన్నత స్థాయికి చేరుకోవాలని,ప్రాథమిక విద్య నుండే చదువులో ప్రతిభ కనబరుస్తూ,గోల్డ్ మెడల్ వరకు చదువుల తల్లిగా పలువురి మన్ననలు అందుకుంది.6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆర్.కె.పురం గురుకుల పాఠశాలలో ఆర్ ఆర్ శంకరన్ ఉత్తమ విద్యార్థి అవార్డు అందుకుంది.ఇంటర్ మేగ జూనియర్ కాలేజ్ రామంతపూర్ లో చదువు పూర్తిచేసి,బీ.కామ్ రేవా యూనివర్సిటీలో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించింది.ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ సివిల్ పరీక్షలకు సన్నద్ధమై ఐఏఎస్,ఐపీఎస్ కావాలనే తన లక్ష్యమని తెలిపింది.హిమబిందు కుటుంబ సభ్యులు,సొంత గ్రామమైన పగిడేరు గ్రామస్తులు,గ్రామ పెద్దలు ఆమెను అభినందించారు.

Share it:

Post A Comment: