CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ డిప్యుటే షన్ లను రద్దుచేయాలి

Share it:

 


రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద.రఘుపతి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయిన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం టీఎస్- ఏటీఎఫ్ ములుగు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు కోర్నిబెల్లి రాఘవరావు అధ్యక్షతన ఏర్పాటుచేయడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద రఘుపతి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరం సంతోష్ లు హాజరై మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితుల నేపద్యములో సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు ప్రారంభం అయిన నేపద్యములో విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు కరోనా టీకా మందును ముందుగా ఇప్పిస్తూ అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలని చూచించారు.

అలాగే ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ క్రింద ఉపాధ్యాయులను డిప్యుటేషన్ ల పేరున సర్దుబాటు చేయడం జరిగినదని.ఈ సర్దుబాటులో అధికారులు వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగిందని అని అన్నారు.ఐటీడీఏ పరిధిలో డిప్యూటీ డైరెక్టర్ తనకు అనూకూలంగా ఉన్న వారికి ఒకరకంగా మరియు వ్యతిరేఖంగా ఉన్న వారికి ఒకరకంగా వ్యహరించి సర్దుబాటు చేయడం జరిగిందని అన్నారు.వెంకటాపూర్ మండలం హెచ్ ఎస్(బి)లక్ష్మీనగరం పే యూనిట్ పరిధిలోని జిపిఎస్ రామకృష్ణాపురం పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులలో హెడ్మాస్టర్ గా వ్యహరిస్తున్న ఉపాధ్యాయునికి పక్షవాతం వచ్చి పాఠశాలకు వచ్చే పరిస్తులు లేకున్నా రెండవ ఉపాధ్యాయుడు అట్టం దామోదర్ ను జిపిఎస్ భోదాపురానికి డిప్యుటేషన్ మీద పంపడం జరిగినదని ప్రక్కనే ఉన్న జిపిఎస్ రామవరం పాఠశాలలో తక్కువ సంఖ్యలో(18) విద్యార్థులు ఉన్నప్పటికీ అక్కడినుండి ఎవరిని తీయకుండా ఉండ డములో ఆంతర్యం ఏమిటో డిప్యూటీ డైరెక్టర్ గారికే తెలియాలని అన్నారు.అలాగే మండల విద్యాధికారులు ములుగు జిల్లా పరిధిలోని 9 మండలాలలో ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండి తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ అక్కడ నుండి జూనియర్ ఉపాధ్యాయులను తీయకుండా సంఘ నాయకులకు భయపడి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండి ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుండి ఒకరిని డెప్యుటేషన్ పంపడం జరిగినదని అన్నారు.

ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపురం పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు సుమారు 50 పైన ఉండి ఎంపిపిఎస్ మామిడి గూడెం(గుత్తి కోయ గూడెం) పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల నుండి ఒకరి ఎంపిపిఎస్ ముళ్లకట్ట పాఠశాలకు సర్దుబాటుచేయడం జరిగినది.దీనికి కారణం ఆకుల వారి ఘనపురం పాఠశాలలో ఒక సంఘ నాయకుడు ఉండడమే కారణం అని, అందువలన ఐటీడీఏ లో చేపట్టిన అక్రమ డిప్యుటేషన్ లను వెంటనే రద్దుచేసి నియమనిబంధనలకు అనూకూలంగా డిప్యుటేషన్ ఇవ్వాలని ఈ విషయములో జిల్లా కలెక్టర్ మరియు పీవో గారు కల్పించుకొని అక్రమ డిప్యూటేషన్ లను రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమ అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భముగా సీనియర్ ఉపాధ్యాయులు అయిన కోర్నిబెల్లి రాఘవరావు ను టిఎస్-ఏటిఎఫ్ సంఘ తరుపున సన్మానించారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు చాట్ల నారాయణ, వెంకటాపూర్ మండల అధ్యక్షులు పూనెం రమేష్, పూసం లక్ష్మీనారాయణ,వజ్జా విష్ణు,నాలి రాంబాబు, మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: