CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వేదిక భవనాన్ని.. నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని.. ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...

Share it:

 



👉 రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..



మన్యం టీవీ :  జూలూరుపాడు, సెప్టెంబర్ 5, ఆదివారం జూలూరుపాడు మండలోని పడమట నర్సాపురం గ్రామం లో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని,  పాపకొల్లు గ్రామంలో ఒక కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఈ  కేంద్రం నుండి నాలుగు ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు.  అలాగే ఈ విద్యుత్ కేంద్రం నుండి పన్నెండు గ్రామాలకు 5 గ్రామపంచాయతీలకు గృహ వాణిజ్య అవసరాలతో పాటు వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో విరిగిపోయిన విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త స్థంభం వేయాలంటే కార్యాలయాల చుట్టూ తిరిగిన చరిత్ర ఉందని,   ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన సంఘటనలు అనేకమని అన్నారు. ఆనాడు పట్టించుకున్న నాథుడే లేడని ఉదయం 6 గంటలకు కరెంటు పోతే సాయంత్రం 6 గంటలకు రాని పరిస్థితి నెలకొన్నదని గుర్తు చేశారు.  విద్యుత్ సమస్యతో విద్యుత్ తీగలకు అన్నదాతలు వేలాడిన సంఘటనలు ఉన్నాయని ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రంలో  నాణ్యమైన కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు.  రాష్ట్రం ఏర్పడిన కొద్దీ కాలంలోనే గృహ,  వాణిజ్య,  వ్యవసాయ రంగాలకు నిరంతరాయంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని ఆయన స్పష్టం చేశారు.  విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని ఆ నాడు శాసనసభలో కేసీఆర్ చెప్తే  విపక్షాలు ఎగతాళి చేశాయని, ఆనాటి రోజులను గుర్తు చేశారు.  రాష్ట్రాన్ని పట్టి పీడించిన విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు.  తెలంగాణ వస్తే చీకటి రాజ్యం వస్తుందని చెప్పిన నాయకులు నేడు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.  ఆరు నెలల్లో ఈ విద్యుత్ కేంద్రం నిర్మించడం  పట్ల  విద్యుత్ శాఖ అధికారులను మంత్రి అభినందించారు. పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి అభ్యర్థన మేరకు జూలూరుపాడు మండల ప్రధాన కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు సైడ్ డ్రైన్ నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సాపురంలో స్థానికులు పలు సమస్యల పై మంత్రికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జూలూరుపాడు మండల అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని మంత్రి పేర్కొన్నారు. వైరా శాసనసభ్యులు రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కోరం కనకయ్య,  జిల్లా కలెక్టర్ అనుదీప్, సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్,  జడ్పిటిసి కళావతి, ఎంపిపి సోని,  విద్యుత్ శాఖ ఎస్ ఈ సురేందర్, వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు,  జడ్పీ సీఈఓ విద్యలత,  డిఆర్డిఎ పిడి మధుసూదన్ రాజు, ఉద్యాన అధికారి మరియన్న, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నర్సింహరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: