CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం.

Share it:


👉 మొహమ్మద్ రియాజ్ సేవలు మరువలేనివి

👉ప్రముఖ న్యాయవాది లక్కీనేని సత్యనారాయణ

👉 ఘనంగా సమాచార-వినియోగదారుల ఫోరం జిల్లా కార్యాలయం ప్రారంభం

👉అక్కినేనికి... రియాజ్ కు ఘన సన్మానం.

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12 (మన్యం టీవీ) సమాచార హక్కు చట్టం పేద వాడి చేతిలో పాశుపతాస్త్రం లాంటిదని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అన్నారు. ఆదివారం జీఆర్బీస్తీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో సమాచార హక్కు చట్టం వినియోగదారుల ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో లక్కినేని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరి చేతిలో పాశుపతాస్త్రం ఉన్నట్లే అని పేర్కొన్నారు. అలాగే వినియోగదారుల హక్కు చట్టం గురించి వివరించారు. వినియోగదారులకు అందాల్సిన నాణ్యమైన, సరసమైన ధరలు అందక పోవడం వల్ల సామాన్య వినియోగదారులు నష్టపోతున్నారని అన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అవగాహన కల్పించాలని సభ్యులను కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టే విధంగా సభ్యులు పనిచేయాలని సూచించారు. ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటానని, సలహాలు సూచనలు ఇస్తానని స్పష్టం చేశారు. వినియోగదారులు అన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవాలి-రియాజ్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ అన్ని విషయాలలో వినియోగదారులు అవగాహన పెంచుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పేదవారికి న్యాయం జరిగే విధంగా తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరిగితే వాటి పై సభ్యులు దరఖాస్తులు పెట్టి స్పష్టమైన సమాచారం తీసుకొని దానిపై పోరాటం చేయాలన్నారు. నిత్యావసరాల కొనుగోలు విషయంలో కూడా సభ్యులు వినియోగదారులకు అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కమిటీ సభ్యులు చిత్త శుద్ధితో పని చేసినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు.

సీనియర్ న్యాయవాది లక్కినేని నత్యనారాయణకు సన్మానం... 

జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం-వినియోగదారుల ఫోరం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సీనియర్ న్యాయవాదులు, కొత్తగూడెం బార్ అసోసియోషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణకు వినియోగదారుల ఫోరం, సమాచార హక్కు రక్షణ చట్టం బృందం ఘనంగా సన్మానించింది. కమిటీకి లక్కినేని మంచి సలహాలు, సూచనలు చేసినందుకు ఆయనకు పలువురు ధన్యవాదాలు తెలిపారు. రియజ్ సేవలు మరువలేనివి... సమాచార హక్కు రక్షణ చట్టం-వినియోగదారుల ఫోరం ఆర్గనైజేషన్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రియాజ్ సేవలను న్యాయవాది లక్కినేని సత్యనారాయణ కొనియాడారు. కమిటీల్లో ముఖ్యంగా మహిళలను తీసుకొని వారిచేత ఆర్గనైజేషన్‌ను ముందుకు తీసుకుపోవడం హర్షనీయమన్నారు. దీని వెనుక రియాజ్ కృషి ఎంతో ఉందన్నారు. అనంతరం రియాజ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ ఎరుకల రామారావు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ బండి రంజిత, జాయింట్ సెక్రటరీ పుణ్యం పద్మ, జిల్లా సెక్రటరీ ఉదయగిరి శ్రీనివాస్, కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాస్, లక్ష్మీదేవిపల్లి మండల్ ప్రెసిడెంట్ ఇమంది హరికృష్ణ, చుంచుపల్లి మండల ప్రెసిడెంట్ కనకలక్ష్మి, జాయింట్ సెక్రటరీ మాగంటి రమేష్, కమిటీ సభ్యులు నవీన్ కుమార్, మండల సెక్రటరీ మోదుగు రాధమ్మ, బండి సాయి సూర్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: