CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మార్కెట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు ఆదివారం శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ. . ఇల్లందు మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోనే అతిపెద్ద మోడల్ మార్కెట్ గా ఇల్లందు మోడల్ మార్కెట్ ఉండబోతుందని తెలిపారు. నిర్మాణ పనులు ఆలస్యం జరగకుండా అధికారులు అనుక్షణం పర్యవేక్షించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పులిగండ్ల మాధవరావు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఇల్లందు మున్సిపాలిటీ డి మరియు మున్సిపల్ 24 వ వార్డు కౌన్సిలర్ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: