CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తిప్పన పల్లి టిఆర్ఎస్ గ్రామ కమిటీ ఎంపిక లో వర్గ పోరు....

Share it:

       


      * ఒక్కరోజులోనే అభ్యర్థి పేరు మార్పు...           

    * ఉద్యమకారుని కి దక్కని అవకాశం.....        

       * నిరసన దీక్షకు ఉద్యమకారులు సన్నద్ధం....            చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:    మండలంలో సజావుగా సాగుతున్న టిఆర్ఎస్ గ్రామ కమిటీల ఎంపికలో ఒక్కసారిగా వర్గపోరు చోటుచేసుకుంది. పార్టీ మండల అడహాక్  కమిటీ ఎంపిక చేసి అభ్యర్థి పేరు ఖరారు చేసిన 24 గంటలు కాకముందే గ్రామంలో ఆధిపత్య పోరు తో పేరు మార్పు జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో గ్రామ కమిటీల ఎంపిక జరుగుతుంది. పలు పంచాయతీలలో పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిప్పన పల్లి గ్రామంలో శనివారం అడహక్ కమిటీ సభ్యుల అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక కోసం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడుగా ఉద్యమకారుడు అయిన గుగులోతు రమేష్, కళ్లెం వెంకటేశ్వర్లు, మధ్య పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయాల మేరకు రమేష్ ని ఎంపిక చేస్తూ ప్రకటించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు వర్గీయుడైన జిల్లా కో ఆప్షన్ సభ్యుడు రసూల్ కళ్లెం వెంకటేశ్వరుని నియమించాలని పట్టుబట్టారు. పేరు ప్రకటించడంతో చేసేదేమీ లేక ఈ విషయాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావు కి రసూల్ ఫిర్యాదు చేశాడు.  దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకి తిప్పనపల్లి విషయాన్ని పరిశీలించాలని చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, రసూల్ అభ్యర్థి వెంకటేశ్వర్లు ని నియమించాలని మండల కమిటీ కి సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెంకటేశ్వర్ల పేరును ఖరారు చేయడంతో తిప్పనపల్లి లో ఉద్యమకారులు ఆగ్రహం చెందారు.ఇటీవల పార్టీ ఫిరాయించి వచ్చిన అభ్యర్థికి పదవి కట్టబెట్టడం ఏంటి అని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని వారు తెలిపారు. సోమవారం చండ్రుగొండ మెయిన్ సెంటర్ లో పార్టీ దీన్ని వద్ద నిరసన దీక్ష చేపడతామని ఉద్యమ కారులు అంటున్నారు. మండలంలో పార్టీ లో ఆధిపత్య పోరు, వర్గపోరు చోటుచేసుకోవడంతో పలువురు సీనియర్ లీడర్లు తలలు పట్టుకున్నారు. మండల అధ్యక్ష పదవికి ఎంత పోటీ ఉంటుందోనని మండలంలో రాజకీయంగా చర్చ జరుగుతుంది. గ్రామ కమిటీల వర్గపోరు తో మండలంలో రాజకీయంగా వేడెక్కింది

Share it:

Post A Comment: