CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పూటకో మాట మారుస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

Share it:

 



- కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి.

మన్యం టీవీ మంగపేట.

ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులతో ఆడుకుంటున్నదని వచ్చే యాసంగి నుంచి వరి వేయొద్దంటూ ఇప్పుడు ఏకంగా రైతుల మెడపై కత్తి పెట్టినంత పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధాన్యం ఉత్పత్తి, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, దేశంలోనే రికార్డు నెలకొల్పిందని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు వరి సాగు చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని అన్నారు. ముందనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ వానాకాలంలో 60 లక్షల టన్నుల వడ్లను కొంటామని కేంద్రం ప్రకటించగా మిగతా వడ్లను సేకరించే బాధ్యత నుంచి రాష్ట్ర సర్కారు తప్పుకుంనెందుకే కుట్ర జరుగుతోందని అన్నారు.

సాగులో భాగంగా కొంత విస్తీర్ణానికే వరిని పరిమితం చేయాలని ఒకసారి, సన్నాలే వేయాలని ఇంకోసారి, భారతదేశం ఆశ్చర్యపడే, అడ్డంపడే శుభవార్త రైతులకు చెప్తామని ఊర్లలో కొనుగోలు కేంద్రాలు పెట్టబోమని ఏడాది నుంచి రాష్ట్ర సర్కారు రకరకాలుగా చెప్తూ వచ్చింది తప్ప దేశం ఆశ్చర్యపడే, అడ్డంపడే శుభవార్త ఇప్పటికీ చెప్పలేదు కానీ వరి సాగు చేస్తే ఉరి వేసుకున్నట్లుగా  రైతు మారాడని సీఎం కేసీఆర్​ హెచ్చరించిన తీరు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. కిలో బాయిల్డ్​ రైస్​ కూడా కొనబోమని కేంద్రం చెప్తోందని, అందుకే రాష్ట్రంలో ధాన్యం కొనే పరిస్థితి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పు మొత్తం కేంద్రంపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. వడ్లు పండించే రైతులకు భరోసా ఇవ్వకుండా ఇలా అల్టిమేటం జారీ చేయడం ఏమిటని  కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది అని తెలిపారు. షరతుల సాగు పేరుతో నిరుటి నుంచే సీఎం కేసీఆర్​ వరి సాగును నియంత్రించే ప్రయత్నం మొదలు పెట్టారు అన్నారు.దొడ్డు బియ్యం కొనే ప్రసక్తి లేదని, సన్న రకాలు మాత్రమే సాగు చేయాలని ఆంక్షలు జారీ చేశారు. దీంతో రైతులు సన్నాలు సాగు చేశారు. తీరా సన్న రకం వడ్లు చేతికొచ్చాక ప్రభుత్వం మాట మార్చి అసలు వడ్లు కొనేది లేదంటూ మొండికేసింది.దీంతో అటు దిగుబడి తగ్గటంతో పాటు ఇటు గిట్టుబాటు ధర రాకపోవటంతో సన్న రకాలు వేసిన రైతులు రోడ్డున పడ్డారు అన్నారు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం ప్రతి గింజ కొంటామంటూ కొనుగోలు ప్రారంభించింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయి సన్నాలన్నీ తక్కువ ధరకు అమ్ముకొని రైతులు భారీగా నష్టపోయారు. సన్నాలకు బోనస్​ ఇస్తామని చెప్పిన సర్కారు ఆ తర్వాత ఆ ముచ్చట్నే ఎత్తలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్​ రైస్​ కొనుగోలు చేయటం లేదనే సాకుతో వరి రైతులను నట్టేటా ముంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు .

Share it:

Post A Comment: