CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

🔸 సాయుధ పోరాట స్పూర్తితో నయా దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి

Share it:


🔸 అమరులు ఆశించిన లక్ష్యాల సాధన దిశగా ఉద్యమిస్తాం

🔸 సెప్టెంబర్ 17 ప్రజాస్వామ్య హక్కులు సాధించుకున్న సుదినం

🔸 సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా

🔸 సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం


మన్యం టీవి,కొత్తగూడెం: నైజాం నిరంకుశపాలన అంతంకోసం ఏడాదిపాటు సాగిన తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తిగా కేంద్ర, రాష్ట్ర నయాదోపిడికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా పిలుపునిచ్చారు. తెలంగాణ విలీనదినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాలులర్పించారు. అనంతరం జరిగిన సదస్సులో సాబీర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించడం లేదంటూ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పాలకులపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ తెలంగాణ వచ్చాక విలీన దినోత్సవాన్ని జరపడానికి ఎందుకు నిరాకరిస్తున్నారో సమాదానం చెప్పాలన్నారు. నాటి మహత్తర పోరాటాన్ని బిజెపి హైజాక్ చేసేందుకు యత్నిస్తుందని, రాచరికానికి, నిర్భంధానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ముస్లీం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఎంఐఎం సైతం ముస్లీంలను ఊచకోత కోశారని తప్పుడు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. సాయుధ పోరాటంలో నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో అన్ని వర్గాల వారు ఉన్నారని, ప్రాణత్యాగం చేశారని బిజెపి, ఎంఐఎం గుర్తుంచుకోవాలన్నారు. కమ్యూనిస్టులు చేపట్టిన వీరోచిత పోరాటాలను తట్టుకోలేకనే నైజాం రాజు హైద్రాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన సుదినం సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జమీందార్లు, నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులదేనన్నారు. నిజాం నిరంకుశపాలనలో మాతృబాషలో విద్యా బోధన నిషేదం, వెట్టి చాకిరి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, దారిద్ర్యం ప్రజలను పట్టి పీడించాయని, అలాంటి పరిస్థితులే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంటున్నాయని అన్నారు. సాయుధ పోరాట అమరులు ఆశించిన లక్ష్యాల సాధన దిశగా పోరాటాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, కల్లూరి వెంకటేశ్వర్ రావు, జిల్లా సమితి సభ్యులు వి.పూర్ణచందర్ రావు, రేసు ఎల్లయ్య, జి.వీరస్వామి, వాగబోయిన రమేష్, వి.పద్మజ, నాయకులు సముద్రాల సుధాకర్, కొవ్వూరి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: