CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కు ఘన సన్మానం..

Share it:

 మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తూ ఇటీవల హైదరాబాదు రవీంద్రభారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న బి సంపత్ కుమార్ ను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ముందుగా తెలంగాణ భాషా దినోత్సవం కాళోజి నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ, కాళోజి నారాయణరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బి సంపత్ కుమార్ దంపతులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సంపత్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, గ్రామ సర్పంచ్ రమాదేవి, ఎస్ఎంసి చైర్మన్ కృష్ణారావు, వైద్యాధికారి వీరబాబు, గ్రామ పెద్దలు పొన్నెకంటి వీరభద్రం, ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్, రామిశెట్టి శ్రీనివాసరావు, కృష్ణవేణి, వెటర్నరీ డాక్టర్ బద్దులాల్, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: