CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కాలంలో సహకరించిన మంచి మనసుకు సన్మానం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం, పినపాక పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు కరోనా కాలంలో పినపాక గ్రామానికి చేసిన సేవలు, అదేవిధంగా పినపాక గ్రామంలో గల జూనియర్ కళాశాల, పాఠశాలల పారిశుద్ధ్యం విషయంలో తీసుకున్న జాగ్రత్తలు గురించి పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. జూనియర్ కళాశాలలో కళాశాల సిబ్బంది తో పాటు, సర్పంచ్ నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పారిశుద్ధ్య పనులను చేయించడం జరిగిందని, కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు అన్నారు. కరోనా కాలంలో పంచాయితీలో రాజీ పడకుండా తన సేవలను అందించాలని కొనియాడారు. ఈ కారణం చేతనే కళాశాల సిబ్బంది అంతా కలిసి గొగ్గల నాగేశ్వరరావును సన్మానించడం జరిగింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొనడం జరిగింది

Share it:

Post A Comment: