CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మైనార్టీ యువతకు సివిల్స్ లో ఉచిత శిక్షణ - మైనార్టీ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా.

Share it:


కొత్తగూడెం: 

2021-2022 సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే మైనారిటీ వర్గాలకు చెందిన  అభ్యర్థులకు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొందేందుకు గాను అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి, కుటంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను www.tmreis.telangana.gov.in నందు ఈ నెల18వ  తేదీ లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొందేందుకు గాను, జిల్లా కేంద్రంలోని  మైనార్టీ గురుకుల పాఠశాలలో  ఈ నెల్ 26 తేదీన స్క్రినింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఈ టెస్ట్ నందు ఆబ్జెక్టివ్ తరహాలో 70 ప్రశ్నలకు 70 మార్కులు,2 డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు 30 మార్కులు మొత్తం 100 మార్కులకు టెస్ట్ ఉంటుందని ఈ టెస్టులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్ లో ఒక ఏడాది పాటు ఉచిత శిక్షణ తో పాటు వసతి,భోజన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఇరు జిల్లాల  మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కోసం  040-23236112 గల నెంబర్ ను సంప్రదించాలని కోరారు.


                                                                                       ఇట్లు                                                                          ఎం.డి యాకూబ్ పాషా

                                                                      జిల్లా మైనారిటీ అధ్యక్షుడు

                                                                      భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా.

Share it:

TELANGANA

Post A Comment: