CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీడీఏ శాఖలను తరలిస్తే ప్రభుత్వంపై యుద్ధం

Share it:

 



 *తుడుండెబ్బ ఏ ఎస్ యు హెచ్చరిక.

మన్యం టీవీ ఏటూరు నాగారం

తాడ్వాయి మండల కేంద్రంలో తుడుండెబ్బ సంఘం సమావేశానికి ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ ముఖ్య అతిధిగా హాజరై ఏటూరునాగారంలో ఆదివాసీల అభివృద్ధి పరిపాలన కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ ను రాష్ట్ర ప్రభుత్వం నీరు గార్చుతూ ఒక్కో శాఖను మైదాన ప్రాంతలకు తరలిస్తున్నారని ప్రభుత్వ పాలన అధికారులు ఐటీడీఏ ను తరలింపును తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఐటీడీఏ తరలింపు నిలుపుదల చేయకుండా తరలింపు కార్యకలాపాలు కొనసాగిస్తే ప్రభుత్వం మీద ఆదివాసీలు ప్రజా సామ్య బద్ధంగా యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు.ప్రభుత్వం నీరు కారుతున్న ఐటీడీఏ కు రెగ్యులర్ పివో (IAS) ను నియమించి పరిపాలనను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.ములుగు జిల్లాలోని ఏఎన్ఎం,జిఎన్ఎం,ల్యాబ్టెక్నేషన్ పోస్టులనునియమించటానికి ఇచ్చిన నోటిఫికేషన్ ను ఏజెన్సీ ప్రాంతంలోని GO NO 68 ప్రకారం 100%శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ అదివాసీలను మాత్రమే నియమించాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈసమావేశంలో తుడుండెబ్బ ఏఎస్ యు నాయకులు మాల్కం సమ్మయ్య,ఇట్టం సతీష్, పాయం,నవీన్,ఇర్పసతీష్,ఎల్ల బోయిన హరీష్,ఇర్పలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: