CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించాలి

Share it:

 


*ఎమ్మెల్యే సీతక్కకు వినతి పత్రం అందజేత.

*కలెక్టర్ మేడారంలో పర్యటించాలి.

*సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించాలని సీతక్క యువసేన నాయకులు ములుగు లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ ఇర్సవడ్ల వెంకన్న,నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నరసింహ్మ స్వామి,సీనియర్ నాయకులు ముదురు కోళ్ల తిరుపతిలతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతి చేయడం జరిగింది అని అన్నార.జంపన్న వాగు కు స్నాన గట్టాలు నిర్మించాలని,ఊరట్టం మేడారం మధ్యలో జంపన్న వాగు మీది హై లెవల్ బ్రిడ్జ్ నిర్మిచాలని, ఊరట్టం నుండి కాల్వపల్లి వరకు బీట్ రోడ్డు వేయాలి అని,ఊరట్టం జీపీ లో భక్తులకు విడిది షెడ్లు,ఊరట్టంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మించుట,పశువుల హాస్పిటల్ మంజూరు,ఊరట్టం,కాల్వపల్లి  గ్రామపంచాయతీలలో సిమెంట్ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణం, ఊరట్టం నుండి కొండాయి బీట్ రోడ్డు వేయాలి అని,ఊరట్టం కాల్వపల్లి లో ఉండే విడిది చేసే భక్తులకు మంచి నీటి కోసం వాటర్ ట్యాంక్ లు నల్లాల ఏర్పాటు,చేతి పంపులు వేయాలి అని,భక్తులు ఉండే చివరి వరకు కరెంటు సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సీతక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని అన్నారు.అనంతరం సీతక్క యువసేన తాడ్వాయి మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం కి మేడారం జాతర అంటే చిన్నచూపు అని,అందుకే ఇప్పటి వరకు సమీక్షా జరపాలని సోయి లేదని, నిధులు వస్తాయో లేదో తెలియదు అని అసలు తాడ్వాయి మండలంలో ప్రభుత్వం ఉన్నట్లే అనిపించడం లేదని,మంత్రులు పట్టించుకోవడం లేదని,కలెక్టర్ గారే చొరవ చూపి సమీక్షా సమావేశం పెట్టి భక్తులు, స్థానికుల,పూజారుల అభిప్రాయాలు తెలుసుకొని,గత అనుభవలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.కలెక్టర్ గారు ఒక్కసారి అయినా మేడారం లో పర్యటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పురుషోత్తమ్, నరసింహులు,దుబాసి సుధాకర్,బడే యాదగిరి, నారాయణ,సమ్మయ్య,స్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: