CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆందోళనలో తెలంగాణ రైతాంగం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

పండించిన వరి ధాన్యంను బేషరతుగా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్...


మన్యం టీవీ మంగపేట.

వరి పంటపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక విధానం వల్ల తెలంగాణ రైతాంగం మరో పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఆత్మ చైర్మన్, బుచ్చంపేట గ్రామ మాజీ సర్పంచ్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మంగపేట మండలకేంద్రంలో ఏర్పాటు చేరిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేయి అనక, పగలు అనక ఆరుగాలం కష్టించి పంట పండించి దేశానికే అన్నం పెట్టే రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణలో అధికార గణాంకాల ప్రకారం 55 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం, సన్నరకం కలిసి 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండిస్తున్నారని అన్నారు. ఇట్టి పంట నుండి కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తామని, మిగతా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను రైతుల నుండి ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. భారత ఆహార సంస్థ వారు పెట్టిన షరతులతో తెలంగాణ రైతాంగం తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం చెపుతున్నట్లు ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉన్నదని, సగటున ఐదు సంవత్సరాలు భారత ప్రజల ఆహారానికి సరిపోతుందని సాకులు చెపుతున్నారని అన్నారు. ఇంత నిలువ ఉన్నపుడు ప్రభుత్వాలు ఖరీఫ్ సీజన్ లో వరి సాగు చేయరాదని అధికార యాంత్రంగంతో రైతులకు ఎందుకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా తెలంగాణ ముఖ్యమంత్రి, ఎఫ్.సి.ఐ వారిని, కేంద్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పై వత్తిడి తెచ్చి మొత్తం వరి ధాన్యం ను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల కేంద్రప్రభుత్వం, ఎఫ్.సి.ఐ వారు కొనుగోలు చేయని ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి పంట కాకుండా పండించే ప్రత్యామ్నాయ పంటలపై సంబంధిత అధికారులతో రైతులకు అవగాహన కల్పించి, గిట్టుబాటు ధర ముందే నిర్ణయించాలని రైతుల తరపున కోరుతున్నామని అన్నారు.

Share it:

Post A Comment: