CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు.

Share it:


👉ఉపాధి హామి పథకానికి రూ.100.72 కోట్లు చెల్లింపులు.

 👉ఇంకుడు గుంతల నిర్మాణాలు వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 14 (మన్యం టీవీ) : ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం క్రింద 100.72 కోట్లు చెల్లింపులు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం హైదరాబాదు నుండి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీపక్కుసూర్ సుల్తానియా, కమిషనర్ డాక్టర్ శరత్ ఉపాధి హామీ పథకం పనులు నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు నిర్వహణ, పల్లె, పట్టణ బృహత్ పల్లె పకృతి వనాలు, హరితహారం తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు, డిపిఓ, డిఆర్డిఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామి పథకం క్రింద ఇప్పటి వరకు 1,53,853 మంది కూలీలకు 75.48 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ క్రింద 25.24 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం పనులను విస్తుృతంగా వినియోగించుకునేందుకు కూలీలను పెద్ద ఎత్తున మొబలైజ్ చేయనున్నట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏకు కేటాయించిన 48.11 లక్షల మొక్కలకు గాను అవెన్యూ ప్లాంటేషన్ క్రింద 26.30 లక్షలు, ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీలో 46,07,659 మొక్కలు నాటినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరంలో హరితహారంలో నాటనున్న మొక్కల కొరకు నర్సరీల్లో మొక్కలు పెంపకం చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చుటకు చర్యలు చేపట్టినట్టి తెలిపారు. 

జిల్లాలో గుర్తించిన 8 ప్రధాన రహదారుల వెంబడి దాదాపు 250 కిమీ మేర మల్టీపర్పస్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు చెప్పారు. బృహాత్ పల్లె పకృతి వనాల్లో మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయుటకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేయుటకు అన్ని చర్యలు చేపట్టన్నుట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఏపిడి సుబ్రమణ్యం, డివిజనల్ పంచాయతీ అధికారులు హరిప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: