CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాకపోకలు బంద్....?

Share it:

 


 -పట్టించుకోని అధికారులు...! -అవస్థలు పడుతున్న ప్రజలు


మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లో గుమ్మడిపల్లి నుండి ఇతర గ్రామాలకు రాక పోకలు బంద్ అయ్యాయి. పెద్దవాగు ప్రాజెక్ట్ కింద గుమ్మడిపల్లి ఊరు చివర లో లెవల్ బ్రిడ్జి ఉంది. అది ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు గ్రామాల రాకపోకలకు ఏర్పాటు చేసిన వంతెన. ఈ వంతెన పూర్తిగా శిథిలం కావడం తో నూతన వంతెనకి అనుమతి రావడం మార్చి నుండి నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు . అదికారులు నూతన వంతెన పనులు మొదలు పెట్టారు కానీ శిథిలం అయిన రహదారికి ప్రత్యమ్నాయ ఏర్పాటు చెయ్యకుండానే నూతన వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. వర్షాకాలం రావడం తో ప్రాజెక్ట్ నుండి వచ్చే నీటితో గుమ్మడిపల్లి నుండి ఇతర గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గత్యంతరం లేక ఇదే నీటిలో నుండి కూలి పనులకు వ్యవసాయ పనులకు ఎరువులు మందులు ద్విచక్ర వాహనం పై వెళ్లాళ్లాలంటే భయం వేస్తుందని చాలా సందర్భాల్లో కూడా వాహనాలు అదుపుతప్పి నీటిలో పడ్డాయని వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు పూర్తి గా రాకపోకలు నిలిచి పోతున్నాయని భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్ మొదటి తారీకు నుంచి స్కూల్ మొదలు అయితే పిల్లలు ఎలా స్కూల్ కి వెళ్ళలో అని అక్కడి గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయాలని అక్కడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share it:

Post A Comment: