CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు శానిటైజర్లు,మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి::భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి అప్పీల్ స్వచ్ఛంద సంస్థ తరఫున ఒక్కొక్కరికి 3 మాస్కులు చొప్పున 100 మందికి 300 మాస్కులు,100 శానిటైజర్ ఎంపీపీ సున్నం లలిత చేతుల మీదుగా పంపిణీ చేశారు.అప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు గోళ్ళ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే సుమారు 1600 విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కొక్కరికి 3 మాస్కులు చొప్పున 4,800 మాస్కులు,శానిటైజర్లు త్వరలోనే పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.మానవ సేవ, పర్యావరణ పరిరక్షణ,అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా అప్పీల్ స్వచ్ఛంద సంస్థ పని చేస్తుందని,త్వరలోనే సింగరేణి కాలరీస్ వారి సహాయ సహకారాలతో జిల్లాలోని ములకలపల్లి,దమ్మపేట మండలలోని గిరిజన ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు,ఉన్నత విద్యను అభ్యసించిన వారు విద్యార్థినీ విద్యార్థులకు బోధించేందుకు వారి యొక్క ప్రతిభను మెరుగుపరిచేందుకు ఎవరైనా ముందుకు వస్తే,తమ సంస్థ తరపున స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన మెటీరియల్ అందజేయగలమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డిపల్లి మండల ఎంపిపి-సున్నం లలిత,అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్-బోడ పద్మ,అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్-పి తిరుపతిరావు,అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్-పర్సా వెంకట్,అన్నపురెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఎంపీటీసీ-కృష్ణారెడ్డి,ఎస్ఎంసి కమిటీ చైర్మన్-జమలయ్య, ప్రధానోపాధ్యాయులు-రవీందర్ రెడ్డి,ఉపాధ్యాయులు-శ్రీరామ్ కుమార్, సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ )-బీభత్స, తదితర ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: