CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన మాకు పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలి

Share it:

 



👉🏻భారజల కర్మాగార యాజమాన్యం నిర్లక్ష్యం తగదు.

👉🏻యాజమాన్యం స్పందించకుంటే 60 కుటుంబాలు వీధిపాలు.

👉🏻అర్హతలు ఉండి కూడా అధోగతి పాలౌతున్న ఉద్యోగులు

👉🏻ఇకనైనా యాజమాన్యం స్పందించాలి.


మన్యం టీవీ, అశ్వాపురం:గౌతమినగర్ కాలనీ


మణుగూరు భారజల కర్మాగారంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పెన్షన్ అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగులకు పెన్షన్ అర్హులుగా పరిగణించే విషయంలో భారజల కర్మాగారం విఫలమైందని బాధిత ఉద్యోగులు గురువారం నాడు గౌతమినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ గోడును వెలిబుచ్చుకున్నారు.భారజల కర్మాగార ఉద్యోగులమైన మేము 1992 కంటే ముందు విధులలో చేరి తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము.సాంకేతిక ఉద్యోగస్తులమైన మేము భారజల కర్మాగారం అనేక సందర్భాల్లో ఇచ్చిన ఉత్తర్వుల పరిధిలోకి వచ్చినప్పటికీ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్ల తాము పెన్షన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.ఇట్టి విషయాన్ని పలుమార్లు యజమాన్యానికి విన్న వించినప్పటకి ఎటువంటి స్పందన లేదు.ఇదే యాజమాన్యం 1992 కంటే ముందు జాయిన్ అయిన ఉద్యోగులను విస్మరించి 2004 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ వర్తింపజేశారు.2000 సంవత్సరంలో యాజమాన్యం భారత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి మాకు అన్యాయం చేస్తున్నారు. ఇదే భారజల కర్మాగార యాజమాన్యం ఉద్యోగులు తమ విధుల్లో చేరిననాటి నుండి ఇరవై సంవత్సరాల లోపు పెన్షన్ స్కీమ్ మారడానికి ఉత్తర్వులు ఉన్నాయన్నారు. అలాంటి ఉత్తర్వులను విస్మరించి మాకు మా కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.నిబంధనలకు లోబడి యజమాన్యం మా పెన్షన్ విషయంలో చర్యలకు పూనుకోవాలని వేడుకుంటున్నారు.ఈ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే మా కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు.మణుగూరు కర్మాగార యాజమాన్యం మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు మా కుటుంబాలకు న్యాయం జరిగే విదంగా పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాడ్య కేశవరావు,సూపర్ వైజర్ ఆర్గనైజషన్ సెక్రటరీ డీ.వి. రావు-డీ.వి చారి,ఈ వి.రెడ్డి-కే. రామారావు,యూ.పుల్లారావు,జి.సత్యనారాయణ,నాగప్రసాద్,రమేష్,చౌహన్,అంజయ్య,రేపాక ప్రసాద్,మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: