CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకుందాం.

Share it:

 


👉జిల్లా కలెక్టర్ దురిశెట్టిఅనుదీప్.

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9(మన్యం టీవీ): మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి, సింగరేణి కాలరీస్ కంపెనీ ఆద్వర్యంలో గురువారం పోస్టాఫీస్ సెంటర్లోని సింగరేణి పాఠశాల వద్ద భక్తులకు ఉచితంగా అందచేయనున్న మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు వినాయన ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి ప్రతిమలతో చేసిన వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం జరగదని, రసాయనాలతో చేసిన విగ్రహాలు నిమజ్జనంతో నీటిలో జీవించే జీవరాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణంలో మట్టి ప్రతిమల విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 9 రోజులు పాటు పరమ పవిత్రంగా నిర్వహించనున్న గణపతి నవరాత్రులను ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా జరుగుపుకోవాలని ఆయన సూచించారు. భక్తులు నిమజ్జన కార్యక్రమాలను సజావుగా, శాంతి యుతంగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, మండపాలను పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు పరిశీలన చేసి రక్షణ చర్యలను తనిఖీ చేయాలని చెప్పారు. మండపాల పరిసరాల్లో మురుగునీటి నిల్వలు లేకుండా పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మైకు వినియోగించాలని, విపరీతమైన శబ్దంతో మైకులను వినియోగించొద్దని చెప్పారు. భక్తులు చేయాల్సిన పనులు చేయకూడని పనులను తెలియచేసే విధంగా అవగాహన కొరకు మండపాల్లో ప్లెక్సీలు చేయాలని చెప్పారు. మండపాలకు తప్పని సరిగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని, అక్రమ విద్యుత్ వల్ల ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ అధికారులు మండపాలను పరిశీలన చేయాలని చెప్పారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో విగ్రహాలు నిమజ్జనం చేయు ప్రాంతాలను మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవిప్రసాద్, సింగరేణి ఎన్విరాన్మెంటల్ జియం కొండయ్య తదితరులు పాల్గొన్నా రు.

Share it:

Post A Comment: